డిల్లీ నుంచి వచ్చినప్పటి నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు.. కాకినాడ పోర్టును ఆకస్మిక తనిఖీ చేసి టీడీపీ ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇచ్చారు.. పీడీఎస్ రైస్ స్మగ్లింగ్ ను ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.. దీంతో పవన్ కళ్యాణ్ తీరుపై రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.. సడన్ గా పవన్ రూట్ మార్చడానికి కారణాలేంటనే దానిపై గుసగుసలు వినిపిస్తున్నాయి..
గత ఎన్నికల్లో టీడీపీ, బిజేపీతో పోటీ చేసిన జనసేన.. 21 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాలను గెలుకుంది.. ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంది.. ఈ క్రమంలో పవన్ కళ్యాన్ స్వంతంగా బలోపేతం అవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఇటీవల కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ప్రత్యేకంగా సమావేశయ్యారు.. రాష్ట అవసరాల దృష్ట్యా నేతలను కలిసినట్లు ఆయన చెబుతున్నా.. దాని వెనుక ప్రత్యేకమైన అజెండా ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి..
కూటమిలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.. దీంతో సీఎం చంద్రబాబునాయుడు ఆయనకు ప్రత్యేకమైన గౌరవం ఇస్తున్నారు.. జమిలి ఎన్నికలు జరిగినా.. లేదంటే 2029 ఎన్నికల్లోనైనా.. జనసేనతోనే కలిసి వెళ్తామని చంద్రబాబు చెబుతూ వస్తున్నారు.. కానీ పవన్ కళ్యాన్ స్టాండ్ మాత్రం అలా కనిపించడంలేదనే ప్రచారం జరుగుతోంది.. ఆయన సైలెంట్ గా పార్టీని బలోపేతం చేసుకునేపనిలో పడినట్టు ప్రస్తుత రాజకీయ పరిణామాలను చూస్తే అర్దమవుతోంది..
ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్దులను పవన్ కళ్యాన్ అన్వేషిస్తున్నారట.. అందులో భాగంగానే ఇప్పటికే మాజీ మంత్రి బాలినేనితో పాటు.. పలువురు కీలక నేతల్ని పార్టీలో చేర్చుకున్నారు.. జమిలి ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసి.. కనీసం 50 నుంచి 70 స్థానాల్లో కూటమితో కలిసి పోటీ చేసే యోచనలో ఆయన ఉన్నట్లు పవన్ సన్నిహితులు చెబుతున్నారు.. అందుకోసమే.. టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని ఎత్తిచూపుతున్నారని.. పొలిటికల్ సర్కిల్ లో చర్చ నడుస్తోంది..