‘జై బోలో.. దేశ్ కీ నేత కేసీఆర్‌’ అంటూ.. హైదరాబాద్ లో టీఆర్ఎస్ బ్యానర్లు

రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరికాసేపట్లో జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. ఇప్పటికే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ నాయకులతో పాటు దేశంలోని బీజేపీయేతర పార్టీలు కొన్ని కేసీఆర్ కు మద్దతు ప్రకటించాయి.

భాగ్యనగరంలో ఎటు చూసినా దేశ్ కీ నేత కేసీఆర్ అన్న బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు నగరంలో వివిధ ప్రాంతాల్లో భారీ బ్యానర్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఇవాళ జ‌ర‌గ‌నున్న ఆ పార్టీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం నేతృత్వంలో టీఆర్ఎస్ నేత‌లు ఏర్పాటు చేసిన పోస్ట‌ర్లు అంద‌ర్నీ స్ట‌న్ చేస్తున్నాయి.

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర స‌ర్కార్ అమ‌లు చేస్తున్న విధానాల‌కు వ్య‌తిరేకంగా సీఎం కేసీఆర్ త‌నదైన శైలిలో పోరాటం మొద‌లు పెట్ట‌నున్నారు. విజ‌య ద‌శ‌మి వేళ నూత‌న పార్టీని ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు కేసీఆర్‌కు విషెస్ చెబుతూ టీఆర్ఎస్ నేత‌లు సిటీలో బ్యాన‌ర్ల‌ను ఏర్పాటు చేశారు.