ఆ ప్రార్ధనల్లో పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం…వైరల్ అవుతున్న న్యూస్!

ఢిల్లీ నిజాముద్దీన్ పేరు చెబితేనే యావత్ భారతదేశం వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఈ నిజాముద్దీన్ మర్కజ్ మత ప్రార్థనలకు హాజరైన వారిలో చాలా మందికి ఈ వైరస్ సోకడం తో ఇప్పుడు ఆ పేరు చెప్పగానే ప్రతిఒక్కరూ భయపడిపోతున్నారు. తెలుగురాష్ట్రాల నుంచి కూడా చాలామంది ఈ ప్రార్థనలకు వెళ్లడం ఆ తరువాత సెల్ఫ్ క్వారంటైన్ పాటించకుండా నలుగురిలో తిరగడం తో ఈ వైరస్ ఆలా వ్యాప్తి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రార్థనల కోసం ఇండోనేషియా తో పాటు ఇతర దేశాల నుంచి కూడా రావడం తో వారి ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ ప్రార్థనలకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల ప్రజలలో చాలామందికి పాజిటివ్ తేలడం తో తెలంగాణా లో ఏకంగా ఆరుగురు చనిపోగా,ఏపీ లో పాజిటివ్ కేసులు కూడా ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీనితో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమై కఠిన లాక్ డౌన్ నియమాలను పాటిస్తున్నాయి. అయితే ఈ ప్రార్థనలకు ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సైతం వెళ్లినట్లు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆయన ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన తరువాత కూడా NPR అంశంపై ముస్లిం మత పెద్దలతో కలిసి సీఎం జగన్‌తో సమావేశమయ్యారని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. ఐతే ఈ వార్తలను డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తీవ్రంగా ఖండించారు. ఈ అంశంపై మాట్లాడిన ఆయన ఎవరో ఉద్దేశ్యపూర్వకంగానే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

దీనిపై చట్టపరంగా క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు పరువు నష్టం దావా వేస్తానని కూడా ఆయన స్పష్టం చేశారు. అలానే ప్రజలంతా కూడా వాస్తవాలు తెలుసుకోవాలని సూచించిన ఆయన ఏపిలో ఇప్పటి వరకు 44 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఒక్కరోజే 21 కేసులు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. బాధితుల్లో ఎక్కువ మంది ఢిల్లీలోని మర్కజ్ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారే ఉన్నారు. ఏపీలో ఇద్దరు పేషెంట్లు డిశ్చార్జి కావడంతో..ప్రస్తుతం 42 యాక్టివ్ కరోనా కేసులున్నట్లు తెలిపారు.