ఈట‌ల రాజేంద‌ర్ లో భ‌యం మొద‌లైందా.. ఎందుకిన్ని ఆరోప‌ణ‌లు…?

తెలంగాణ రాజ‌కీయాల్లో ఈట‌ల రాజేంద‌ర్ కు ఒక మంచి ఇమేజ్ ఉంద‌నే చెప్పాలి. ఆయ‌న మొద‌టి నుంచి ఎవ‌రితోనూ వివాదాల‌కు పోలేదు. అంద‌రితోనూ సౌమ్యుడిగా మెలిగే వారు. అందుకే ఆయ‌న‌కు పెద్ద‌గా వ‌ర్గ విభేదాలు లేవు. మొద‌టి నుంచి ప్ర‌తి ఒక్క‌రితో క‌లుపుగోలుగా ఉంటూనే వ‌స్తున్నారు. అయితే ఆయ‌న కారుదిగి కాషాయ జెండా కింద‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి చాలా ఇరిటేష‌న్ లో క‌నిపిస్తున్నారు.

వ‌రుస‌గా ఆయ‌న టీఆర్ఎస్ నాయ‌కుల మీద చాలా కోపోద్రిక్తంగా మాట్లాడుతున్నారు. అంతే కాదు నిత్యం హ‌రీశ్ రావు మీద ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. త‌న మీద ఎలాగైనా గెలిచేందుకు హ‌రీశ్ రావు విప‌రీతంగా క‌ష్ట‌ప‌డుతున్నాడ‌ని, త్వ‌ర‌లోనే ఆయ‌న‌కు కూడా త‌న‌లాగే గ‌తి ప‌డుతుంద‌ని గుర్తుపెట్టుకోమంటూ ఆవేద‌న తెలుపుతున్నారు.

ఇక టీఆర్ఎస్ మంత్రులపై కూడా ఆయ‌న నిత్యం సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. అయితే కొంద‌రు మంత్రులు త‌న‌లాగే పద్ధతి తప్పలేద‌ని అయితే వారు కూడా త‌న‌లాగే టీఆర్ ఎస్ నుంచి గెంటివేయ‌బ‌డుతార‌ని వివ‌రించారు. ఇక గంగుల‌పై హ‌త్యారోప‌ణ‌లు చేయ‌డం కూడా పెద్ద దుమార‌మే రేపుతోంది. ఇలా వ‌రుస‌గా ఈట‌ల రాజేంద‌ర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం ఇప్పుడు ఆయ‌న‌లో కొంత భ‌యాన్ని చూపిస్తున్నాయి. ఆయ‌న టీఆర్ ఎస్ భ‌యంతోనే ఇన్ని ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.