ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.. అందులో భాగంగా ఆగస్టు 15 నుంచి ఏపీలో అన్నా క్యాంటీలను కూటమి ప్రభుత్వం ప్రారంభించింది.. వైసీపీ ప్రభుత్వం మూసేసిన అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభి.. నిరుపేదలకు కడుపునిండా భోజనం పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.. అయితే అన్నా క్యాంటీన్ భవనాలపై దివంగత ముఖ్యమంత్రి రామారావుతోపాటు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోలను మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేసింది.. ఈ వ్యవహారం జనసేనకు రుచించడం లేదట.. డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ కు సమన్యాయం ఇవ్వట్లేదనే భావన వారిలో వ్యక్తమవుతుందనే ప్రచారం జరుగుతోంది.
జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీ కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు.. దీంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు కూడా ఏర్పాటు చేశారు.. ప్రభుత్వ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ కు తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు.. అయితే అన్నా క్యాంటీన్ల పై పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడంపై జనసేన నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని టాక్ వినిపిస్తోంది.. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో.. జన సైనికులు మీడియా ముందుకు వచ్చి మరీ రచ్చ చేశారు. అన్నా క్యాంటీన్లో భవనాలపై తమ నాయకుడు ఫోటోను ఉంచాలంటూ డిమాండ్ చేశారు.. ఈ వ్యవహారం తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి..
డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ కు తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఇవ్వడం లేదని జనసేనలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇలాంటి విషయాలను పట్టించుకోనప్పటికీ.. తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని జన సైనికులు తమ అసంతృప్తిని ఎమ్మెల్యేల వద్ద వెళ్లగక్కుతున్నారు.. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా.. ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులకు.. తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్న చర్యలు అగ్రహవేశాలను తెప్పిస్తున్నాయని పార్టీలో ప్రచారం నడుస్తోంది.. పిఠాపురంలో రాజుకున్న ఈ అసంతృప్తి వివాదం.. చిలికి చిలికి గాలి వానలాగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. దీనిపై తెలుగుదేశం పార్టీ సీరియస్ గా దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు..