అరటిపండ్లు తినడం వల్ల బరువు పెరుగుతారా ?.. ఇందులో నిజమెంత ?

పండ్లలో చవకైనా పండు అరటిపండు ఒకటి. భోజనం తర్వాత తింటే జీర్ణక్రియబాగా అవుతుందని అంటుంటారు. అరటిపండు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అరటితొక్కతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇలా అరటిపండులో రెండు పార్ట్స్ వల్ల లాభాలే ఉన్నాయి. కానీ బరువుతగ్గాలని భావించే వాళ్లు మాత్రం అరటిపండును దూరంపెడతారు. చాలామందిలో అరటిపండుతింటే బరవు పెరుగుతారు అనే ఆలోచన ఉంది. నిజానికి డైలీ నైట్రుగు అన్నం అరటిపండు తింటే బుుగ్గలు బూరెల్లా ఊరతాయి, వెయిట్ గెయిన్ కూడా అవుతారు, వీక్ ఉన్నవాళ్లకు ఇది ఒక మంచి చిట్కా అని పెద్దొళ్లు అంటుంటారు. ఈ లాజిక్ వల్లే బరువుతగ్గాలనుకునే వాళ్లు అరటిపండ్లను మానేస్తున్నారు.

వాస్తవానికి బరువు తగ్గాలంటే, తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా అరటిపండ్లు ఉండాలంటున్నారు డైట్ నిపుణులు. అరటిలో ఫైబర్, పొటాషియం, కార్బొహైడ్రేట్స్ పోషకాలతోపాటూ, విటమిన్ సీ, ఇతర ఖనిజాలుంటాయి. ఇండియాలో చాలా మంది టిఫిన్, బ్రేక్ ఫాస్ట్ కింద అరటిపండ్లనే తీసుకుంటారు. ఎక్కువగా రూమ్స్, హాస్టల్లలో ఉండే వాళ్లు ఇలా చేస్తుంటారు. తిన్నవెంటనే ఎనర్జీ రావాలంటే, అందుకు అరటిపండ్లే బెస్ట్ ఆప్షన్.

బరువు తక్కువగా ఉండేవాళ్లు, తమ డైట్‌లో అరటిపండ్లను చేర్చుకుంటే, బరువు పెరిగేందుకు వీలవుతుంది. అలాగని అరటిని తింటే బరువు పెరిగిపోతామని అపోహపడాల్సిన పనిలేదు. ఇందుకు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

అరటిలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. బరువును కంట్రోల్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. సరిపడా బరువు ఉండేలా చేస్తుంది. అరటిలోని పీచు పదార్థం మరింత ఆకలి వెయ్యకుండా చేస్తుంది. మైక్రోబయోటిక్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ ప్రాక్టీషనర్ శిల్ప అరోరా ఏం అంటున్నారంటే.. అరటిరలోని పీచు పదార్థాలు, బరువు తగ్గేందుకు సహాయపడతాయి. శరీరంలో వివిధ విభాగాలు చక్కగా పనిచేసేలా చేస్తాయి.

సాధారణంగా పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకున్నప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ తప్పుతాయి. అయితే అరటిపండ్ల విషయంలో అలా జరగదు. వీటిలోని సూక్ష్మ పోషకాలు, శరీరం చక్కగా, చురుగ్గా పనిచేసేందుకు దోహదపడతాయి. ఆరోగ్యాన్ని కాపాడతాయి.

భోజనం తర్వాత అరటిపండు తీసుకోవడం ఎంతో మంచిది. శ్రమతో కూడిన పని చేసే ముందు అరటి పండు తినడం ఎంతో మేలు చేస్తుందంటున్నారు వైద్యులు. అరటిలో ఉండే పొటాషియం, బీపీని కంట్రోల్‌లో ఉంచుతుంది. అలాగే ఎక్కువ మోతాదులో ఉండే మెగ్నీషియం, కాల్షియం, ఫోలేట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

కొంతమంది అరటిపండ్లను ఇతర పదార్థాలతో కలిపి తీసుకుంటారు.అది మంచిదే..అరటితోపాటూ ఓట్స్ కలిపి తీసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.