జగన్ ఆ నిజం తెలుసుకోవడం లేదా…?

-

ఏపీలో సిఎం జగన్ బలంగా ఉన్నారు కాబట్టి రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోవచ్చు. కాని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన నడిపే విధానంపై మాత్రం చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ బలం వేరు పరిపాలన వేరు. కాని ఏపీలో మాత్రం ఇప్పుడు పరిపాలన విషయంలో సిఎం జగన్ ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్ళడం లేదు అనే భావన… వ్యక్తమవుతుంది. అసలు ఎందుకు ఈ భావన…? ఏంటీ అనేది చూస్తే… మాట తప్పను మడమ తిప్పను అని సిఎం జగన్ చెప్తూ ఉంటారు.

ఆ మాటకు న్యాయం చేయడానికి ఆయన సిఎం హోదాలో చాలా బాగా కష్టపడుతున్నారు. కాని ఆయన మాత్రం అప్పుల విషయంలో చాలా వరకు కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. సంక్షేమ కార్యక్రమాలకు అప్పులు తీసుకొచ్చి అమలు చేయాలి అనుకోవడం నిజంగా అతిపెద్ద తప్పు. ఎందుకంటే… అప్పుల ద్వారా ఆస్తులు పెంచుకోవాలి. ఏపీలో ఆశించిన స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి మౌలిక సదుపాయాలు లేవు. కాబట్టి ఆస్తులను పెంచుకుంటే బహిరంగ మార్కెట్ లో అప్పు పుట్టే అవకాశం ఉంటుంది.

పెట్టుబడి పెట్టడానికి కూడా మౌలిక సదుపాయాలను చూసే వస్తారు. సంక్షేమ కార్యక్రమాలు చూసి వచ్చే అవకాశాలు ఉండవు. కాబట్టి ఇప్పుడు అప్పులు తీసుకుని ఆస్తులను పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. శాశ్వత భవనాలు నిర్మించుకోవాల్సిన అవసరం ఏపీ మీద ఉంది. కాని ఏపీలో ఆ విధంగా పరిస్థితి లేదు. క్షేత్ర స్థాయిలో ప్రజల్లో బలం కోసం చూస్తే జై జగన్ అంటారు గాని, జై ఏపీ అనే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చే జీఎస్టీ పరిహారం రూపంలో వచ్చే అప్పు సహా అన్నీ కూడా మౌలిక సదుపాయాల మీద వెచ్చిస్తే మంచిదనే భావన వ్యక్తమవుతుంది.

పరిపాలనలో జగన్ కు అనుభవం తక్కువ కాబట్టి ఇలా చేస్తున్నారు అని విశ్లేషకులు అంటున్నారు. సిఎంగా బాధ్యతలు చేపట్టి 18 నెలలు కావొస్తుంది. కాబట్టి జగన్ అన్ని విషయాల్లో ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. వాస్తవంగా మాట్లాడితే ఏ ప్రభుత్వం అయినా సరే సంక్షేమ కార్యక్రమాలతో కుదేలు అయిపోతుంది. అందుకే ఎన్నికల్లో ఇచ్చిన భారీ హామీలను మళ్ళీ ఎన్నికల ముందు ఎంతో కొంత అమలు చేస్తారు. ఇప్పుడు జగన్ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు అనే పేరు ఉంది. కాబట్టి అప్పులు చేసి పప్పు కూడు పెట్టకుండా ఉంటే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news