దుబ్బాకలో టీఆర్‌ఎస్ కి ఆ నేత జలక్ ఇచ్చినట్లేనా…!

-

దుబ్బాక ఉప ఎన్నిక ఇప్పుడు రాజకీయంగా రసవత్తంగా మారింది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాడానికి టీఆర్‌ఎస్‌ విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే, మరో వైపు టీఆర్‌ఎస్‌ను ఓడించి ఉనికి నిలుపుకోవాలి బీజేపీ ప్రయత్నిస్తుంది…కాంగ్రెస్ కూడా గెలుపుకోసం గట్టిగానే ప్రయత్నిస్తుంది..ఇప్పటికే బీజేపీ తన అభ్యర్ధిని ప్రకటించి ప్రచారంలో ముందుంది..టీఆర్‌ఎస్‌,కాంగ్రెస్‌ ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకచించకుండానే ప్రచారాలు చేస్తున్నాయి..

టీఆర్‌ఎస్‌లో అభ్యర్థి విషయంలో అనేక సమస్యలు వస్తుండటంతో పార్టీ అధిస్థానం కాస్త డిఫెన్స్ లో పడింది..కరోనాతో మృతి చెందిన ఎమ్మెల్యే రామలింగరెడ్డి కుమారుడు పోటీ చేస్తారన్న తర్వాత పార్టీలో స్థానిక సెకండ్ గ్రేడ్ లీడర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో టీఆర్ఎస్ ఎన్నికల బాధ్యత పార్టీ ట్రబుల్ షూటర్ హరీశ్ రావుకి అప్పగించి నాయకులను ఏకతాటి పైకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. అయితే హరీశ్ జరిపిన సమావేశంలోనూ రామలింగరెడ్డి కుమారునికి టికెట్ ఇస్తే పార్టీకి ఇబ్బందేనని స్థానిక నాయకులు తేల్చి చెప్పారు. ప్రత్యామ్నాయంగా రామాలింగారెడ్డి భార్యని బరిలో దింపేయోచనలో ఉంది గులాబీ పార్టీ.

అయితే గత ఎన్నికల ముందు టీఆర్ఎస్ లో చేరిన ముత్యం రెడ్డి కుటుంబం అవకాశం కోసం ఎదురుచూస్తుంది. ఈ ఎన్నికల్లో తమ కుటుంబానికి టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారాడానికి కూడా వెనుకాడమని ముత్యం రెడ్డి కుమారుడు సన్నిహితుల సమావేశంలో వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది. శ్రీనివాసరెడ్డి కనుక పార్టీ వీడితే అది టీఆర్ఎస్ కి కాస్తా ఇబ్బందికర పరిణామంగా మారనుంది. చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి టిక్కెట్ దక్కించుకున్నట్లైతే దుబ్బాక ఎన్నికల పోటీ మంచి రసవత్తరంగా మారనుంది.

Read more RELATED
Recommended to you

Latest news