తెలంగాణ రాజకీయాల్లోనే అతి భారీగా ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరగనున్న విషయం తెలిసిందే. దాదాపు 5 లక్షల మందితో..అనేక మంది జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకుల పాల్గొనేలా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సభ ద్వారా దేశ రాజకీయాల్లోనే కాదు..తెలంగాణలో కూడా మరోసారి అధికారంలోకి రావాలనే స్కెచ్‌తో కేసీఆర్ ముందుకెళుతున్నారు. వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ మూడోసారి కూడా తెలంగాణలో అధికార పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తున్నారు.
అయితే ఈ సారి అధికారం దక్కడం అంత ఈజీ కాదనే చెప్పాలి..ఓ వైపు బీజేపీ వేగంగా పుంజుకుంటుంది. ఇలాంటి తరుణంలో బీజేపీకి చెక్ పెట్టాలని కేసీఆర్ చూస్తున్నారు. అదే సమయంలో జాతీయ స్థాయిలో కూడా బీజేపీకి చెక్ పెట్టాలని కేసీఆర్ ప్లాన్. ఇలా రెండు రకాలుగా బీజేపీని టార్గెట్ చేస్తూ…ఖమ్మంలో భారీ స్థాయిలో బీఆర్ఎస్ తొలి ఆవిర్భావ సభని ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా తమ సత్తా ఏంటో జాతీయ స్థాయిలో చూపించాలని అనుకుంటున్నారు.
ఈ సభ ద్వారా కారు పార్టీ దిశ-దశ మారుతుందా అనే చర్చ మొదలైంది. ఎలాగో రాష్ట్ర రాజకీయాల నుంచి దేశ రాజకీయాల వైపు కేసీఆర్ దిశ మార్చారు. కానీ దేశ రాజకీయాల్లో బీజేపీకి చెక్ పెట్టడం, అక్కడ సత్తా చాటడం ఈజీ కాదు. ఇప్పుడున్న పరిస్తితుల్లో జాతీయ రాజకీయాల్లోని కారు పార్టీ దశ మారడం జరిగే పని కాదు. ఇక తెలంగాణ వరకు వస్తే ఇక్కడ మళ్ళీ అధికారమే కేసీఆర్ టార్గెట్..మరి ఆ పరిస్తితి ఉందా? అంటే కొంతవరకు ఉందనే చెప్పాలి.
ఎందుకంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఓట్ల చీలిక భారీగా ఉంటే కారు పార్టీకి లాభమే. అలా కాకుండా కాంగ్రెస్ దిగజారిపోయి బీజేపీ ఇంకా పికప్ అయితే బీఆర్ఎస్ పార్టీకి రిస్క్. అప్పుడు తెలంగాణలో కూడా దశ తిరగడం కష్టమే. అందుకే ఖమ్మం సభతో దిశ మారేనా..దశ మారడం అనేది ఈజీ కాదు.