ఎడిట్ నోట్: పవన్‌ ‘కీ’..!

-

ఏపీ రాజకీయాలు ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చుట్టూనే తిరుగుతున్నాయి. రాష్ట్రంలో రాజకీయాలు మారాలన్న..అధికారం అటు ఇటు అవ్వాలన్న అంతా పవన్ చేతుల్లోనే ఉన్నట్లు కనిపిస్తోంది. ఆయనదే కీ రోల్ అని చెప్పవచ్చు. అదేంటి గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండుచోట్ల ఓడిపోయారు..అసలు జనసేన పార్టీకి ఒకటే సీటు వచ్చింది. ఇప్పుడు గట్టిగా తిప్పికొడితే జనసేన పట్టుమని 10 సీట్లు గెలవలేదు..మరి అలాంటప్పుడు పవన్ కీ రోల్ ఎలా పోషిస్తారంటే..అక్కడే ట్విస్ట్ ఉంది.

ఇప్పుడున్న పరిస్తితుల్లో జనసేన సింగిల్ గా పోటీ చేస్తే 10 సీట్లు గెలుస్తుందా? అంటే చెప్పలేని పరిస్తితి..కానీ దాదాపు 50 సీట్లలో గెలుపోటములని తారుమారు చేసే శక్తి జనసేనకు ఉంది. ఆ విషయం గత ఎన్నికల్లోనే రుజువైంది. ఓట్లు చీల్చి పలు సీట్లలో గెలుపోటములని తారుమారు చేసింది. ఇక జనసేన ఓట్లు చీల్చడం వల్ల టీడీపీకి నష్టం జరగగా, వైసీపీకి మేలు జరిగింది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో కూడా అదే పరిస్తితి ఇంచుమించు ఉంటుంది. అంటే ఏదైనా పవన్ చేతుల్లోనే ఉంది..అంటే వైసీపీకి చెక్ పెట్టాలన్న..టీడీపీని గెలిపించాలన్న పవన్‌తోనే ఉంది.

After Tholi Prema and Khushi, Another Pawan Kalyan Classic Title In Demand

అందుకే పవన్‌ని కలుపుకు వెళ్లాలని చంద్రబాబు ఎప్పటినుంచో చూస్తున్నారు. ఇటు పవన్ సైతం..జగన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. జగన్ ప్రభుత్వాన్ని దించేయాలని చూస్తున్నారు. కానీ సింగిల్ గా పవన్ వల్ల కాదు..అందుకే ఆయన కూడా బాబుతో కలిసి ముందుకెళుతున్నారు. అంటే టీడీపీ-జనసేన కలిస్తే వైసీపీకి చెక్ పడుతుందని విశ్లేషణలు వస్తున్నాయి. ఇక్కడ పవన్‌దే కీ రోల్..అందుకే అటు టీడీపీ నేతలు పవన్ సపోర్ట్ కోసం చూస్తుంటే..ఇటు వైసీపీ నేతలు పవన్‌నే టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు.

పవన్‌ని నెగిటివ్ చేస్తే పొత్తు పెట్టుకున్నా తమపై ప్రభావం ఉండదని చూస్తున్నారు. అలాగే టీడీపీ-జనసేన శ్రేణుల మధ్య గొడవ పెట్టేలా వైసీపీ రాజకీయం చేసేలా ఉంది. ఇక పొత్తు ఉంటే బాబు-పవన్‌లో సీఎం ఎవరు అనే చర్చ వైసీపీ తీసుకొచ్చి..ఆ రెండు పార్టీల మధ్య విభేదాలు పెరిగేలా చేసి పొత్తుని దెబ్బతీయాలని చూస్తున్నారు. అయితే వైసీపీ ఎన్ని చేసిన..రాజకీయాలని ఎటు మార్చాలన్న అది పవన్ చేతుల్లోనే ఉందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news