ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటే పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగాయి. రెండు ఎన్నికలు ఒకేసారి జరగడంతో.. అటు రాష్ట్రంలో.. ఇటు దేశం మొత్తం మార్పు వచ్చే అవకాశం ఉంది కాబట్టి.. ఏపీకి సంబంధించినంత వరకు దేశమంతా ఆసక్తిగానే ఉంది.
ఏపీలో ఎన్నికలు ఏప్రిల్ 11నే ముగిశాయి. ఎన్నికలు ముగిసినా.. ఏపీలో రాజకీయ వేడి మాత్రం ఇంకా రగులుతూనే ఉన్నది. ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడిపోతారు. ఈసారి సీఎం ఎవరు.. వచ్చే ఐదేళ్లలో ఏపీ ముఖ చిత్రం ఎలా ఉండబోతోంది. టీడీపీ మళ్లీ అధికారాన్ని సంపాదించుకుంటుందా? లేక జగన్ పాదయాత్ర పోరాటం ఫలిస్తుందా? లేదా.. మొన్న మొన్న వచ్చిన పవన్ కల్యాణ్ ప్రముఖ పాత్ర పోషిస్తారా? అసలు.. ఏం జరుగుతుందో అని తెలియక.. అయోమయంలో ఉన్నారు ఏపీ రాజకీయ నాయకులు, ప్రజలు. ఇవన్నీ తెలియాలంటే మే 23 దాకా ఆగాల్సిందే.. తప్పదు కదా.
అయితే.. ఏపీకి సంబంధించి ఎన్నికల ఫలితాల కోసం చాలా ఆతృతగానే ఎదురు చూస్తున్నారు అంతా. ఎందుకంటే.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటే పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగాయి. రెండు ఎన్నికలు ఒకేసారి జరగడంతో.. అటు రాష్ట్రంలో.. ఇటు దేశం మొత్తం మార్పు వచ్చే అవకాశం ఉంది కాబట్టి.. ఏపీకి సంబంధించినంత వరకు దేశమంతా ఆసక్తిగానే ఉంది.
అయితే.. ఈసారి ఎన్నికల ఫలితాలు ఆలస్యమవుతాయట. దాదాపు 5 నుంచి 6 గంటల వరకు ఫలితాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజానికి ఈవీఎంల ద్వారా తొందరగా ఫలితాలు తెలుసుకోవచ్చు. బ్యాలెట్ పత్రాల కన్నా ఇది చాలా సులభంగా, తొందరగా ఫలితాలు ఇస్తుంది. కానీ.. ఇప్పుడు కొత్తగా వీవీప్యాట్స్ వచ్చాయి కదా. ఆ వీవీప్యాట్ల వల్ల ఫలితాలు లేట్ అవుతాయట.
ఇప్పుడు వీవీప్యాట్ స్లిప్పులను కూడా లెక్కించాలని చెబుతున్నారు కదా. దీంతో ఫలితాలు కాస్త ఆలస్యం అవనున్నాయట. ఒక లోక్ సభ నియోజకవర్గం తీసుకుంటే… ఆ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదు వీవీప్యాట్ లను ర్యాండమ్ విధానంలో ఎంపిక చేసి.. వాటి స్లిప్పులను లెక్కిస్తారు. ఆ లెక్కంతా పూర్తయ్యాక.. వీవీప్యాట్ స్లిప్పులు, ఈవీఎంలో పోలైన ఓట్లు కరెక్ట్ గా ఉండాలి.. అప్పుడే ఫలితాలు వెల్లడిస్తారు. ఏమాత్రం తేడా వచ్చినా ఫలితాలను వెల్లడించరు. దీంతో వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించి ఫలితాలను విడుదల చేయడానికి కనీసం 5 నుంచి 6 గంటల సమయం పడుతుందట.
ఒకవేళ వీవీప్యాట్ల స్లిప్పులు, ఈవీఎంలలో ఓట్లలో తేడా వస్తే?
అలా జరిగితే.. మళ్లీ లెక్కిస్తారట. మరోసారి కూడా అలాగే రెండింటి మధ్య వ్యత్యాసం వస్తే.. వీవీ ప్యాట్ చీటీల్లోని సంఖ్యనే ప్రామాణికంగా తీసుకుంటారు. ఇలా ఓట్లలో తేడా వస్తే.. ఫలితాల వెల్లడి ఇంకాస్త ఆలస్యం అవుతుంది.