ఏలూరు పోరు: ఆళ్ళ నాని.. పవన్‌కు చెక్ పెడతారా?

-

టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అయింది. దీంతో పొత్తు ప్రభావం ఉన్న స్థానాల్లో వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. ప్రధానంగా కాపు ఓటర్ల ప్రభావం ఉన్న స్థానాల్లో. అయితే పవన్‌కు చెక్ పెట్టి కాపు ఓటర్ల మద్ధతు పొంది మళ్ళీ గెలవాలని వైసీపీ ఎమ్మెల్యేలు చూస్తున్నారు. ఇదే క్రమంలో మాజీ మంత్రి ఆళ్ళ నాని అదే పనిలో ఉన్నారు. 2019లో జగన్ హవాలో ఆళ్ల నాని ఏలూరు నియోజకవర్గాన్ని సొంతం చేసుకున్నారు. జగన్ క్యాబినెట్ లో మంత్రి పదవి కూడా పొందారు. నియోజకవర్గ అభివృద్ధి పనులకు కూడాచేశారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు తనదైన కృషి చేశారు.  కానీ ఏలూరులో టిడిపి, జనసేన అభిమానులు, కార్యకర్తలు ఎక్కువగా ఉన్నారు.

2019 ఎన్నికల్లో టిడిపి, జనసేన విడివిడిగా పోటీ చేశాయి. వైసీపీకి 72 వేల ఓట్లు వస్తే, టి‌డి‌పికి 68 వేలు, జనసేనకు 16 వేల ఓట్లు వచ్చాయి. ఆళ్ళ నాని టి‌డి‌పిపై 4 వేల ఓట్ల తోనే గెలిచారు. అప్పుడే టి‌డి‌పి-జనసేన కలిసి ఉంటే నాని గెలుపు కష్టమయ్యేది. ఇప్పుడు పొత్తు ఫిక్స్ అయింది. 2024లో కూడా ఇదే విధంగా పోలింగ్ ఉంటే వైసిపి గెలుపు కష్టమని అందరూ అంటున్నారు.

ఇవన్నీ చూస్తుంటే ఆళ్ళ నాని గెలుపుకు టిడిపి, జనసేన పొత్తు చెక్ పెడుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో అభిమానులు, కాపుల ఓట్లు పవన్..టి‌డి‌పికి తాకట్టు పెడుతున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇక పవన్ సి‌ఎం పదవి తీసుకోకుండా టి‌డి‌పికి పనిచేయాలని చూస్తే, కాపుల ఓట్లు మళ్ళీ వైసీపీకే పడతాయి. అదే జరిగితే ఏలూరులో ఆళ్ళకు ప్లస్ అవుతుంది..లేదంటే మళ్ళీ గెలుపు కష్టమే.

Read more RELATED
Recommended to you

Latest news