దుండిగల్ భూములు గుంజుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని… రేవంత్ సర్కార్ కు మల్కాజిగిరి BJP పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ వార్నింగ్ ఇచ్చారు. కుత్బుల్లపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ దుండిగల్ గ్రామంలో సర్వే నెంబర్ 453, 454 లలో ఉన్న లవాని పట్ట 450 ఎకరాల భూమిలో కొంత భూమిలో డబల్ బెడ్లు నిర్మించారు. మిగతా 410 ఎకరాల్లో ఉన్న రైతులకు ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వకుండ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సర్వే నంబర్లలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 600 మందికి 60 గజాల ఇందిరమ్మ పట్టాలు కూడా ఇచ్చారు.

2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఈ భూమికి పట్టాలు ఇప్పిస్తామని రేవంత్ రెడ్డి హామీ కూడా ఇచ్చారనీ.. ఇప్పుడు లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారనీ.. తెలియడంతో అక్కడికి వెళ్ళిన ఎంపీ ఈటల రాజేందర్..రైతులకు అండగా నిలిచారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ…ఈ భూముల్లో 40 ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు. ఈ భూముల్ని ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చని అధికారులు మాట్లాడుతున్నారు.. ఏమనుకుంటున్నారు ? కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇలానే చేసి నాశనం అయ్యిందని ఫైర్ అయ్యారు.
అసైన్డ్ భూములను ఇష్టం వచ్చినట్లు లాక్కొనే అధికారం ఎవరికి లేదని వార్నింగ్ ఇచ్చారు. రింగ్ రోడ్డు అప్పుడు కూడా ఇలానే అసైన్మెంట్ భూములను రూపాయి ఇవ్వకుండా గుంజుకుంటుంటే రాజశేఖర్ రెడ్డితో కొట్లాడినం. పట్టా భూములతో సమానంగా అసైన్డ్ భూములకు కూడా నష్టపరిహారం ఇచ్చేవరకు వదిలిపెట్టలేదని హెచ్చరించారు. ప్రభుత్వానికి అవసరమైతే అదికూడా ప్రజలకోసం అయితే నష్టపరిహారం ఇచ్చి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈటల. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాదన్నారు.
గద్దల్లాగా వచ్చి ప్రజల్ని అదరగొట్టి బెదరగొట్టి పోలీసుల సహాయంతో పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే మంచిగా ఉండదు. నేను ఇక్కడ ఎంపీగా ఉన్న అంటూ గుర్తు చేశారు ఈటల. అసైన్డ్ భూములు ఒక్క సంవత్సరం కోసం ఇవ్వరన్నారు. తాత జాగీర్ లాగా ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని మండిపడ్డారు. వారి తరఫున నేనే కోర్టుకు పోతానని….భరోసా కల్పించారు ఈటల. అనేక రాష్ట్రాల్లో 15 ఏళ్లు దాటిన తర్వాత అసైన్డ్ భూములపై సంపూర్ణ హక్కులు ఇచ్చేస్తారన్నారు.
తమిళనాడు, యూపీలో ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ కూడా ఇస్తానని ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. కడు బీదరికంలో ఉన్నవారికి భూమి ఇచ్చారని….రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా వ్యవహరించమని కాదు మీకు ఓట్లు వేసిందని చురకలు అంటించారు. నేను మీవెంట ఉంటానని దుండిగల్ ప్రజలకు హామీ ఇచ్చారు. భూములు గుంజుకుంటె చూస్తూ ఊరుకునేది లేదన్నారు.పేదలను వేధించే అధికారం ఎవరికీ లేదని వార్నింగ్ ఇచ్చారు. వారికి ఎవరూ దిక్కులేదు అని అనుకోవద్దని….ఈ భూములు అమ్ముకుంటే రెస్యూమ్ చేయండి అన్నారు. కానీ గుంజుకుంట అంటే ఊరుకునేది లేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్.