హుజూరాబాద్‌లో ఉత్కంఠ… పద్మవ్యూహాన్ని చేధిస్తున్న ఈటల…

హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ని ఓడించడానికి అధికార టి‌ఆర్‌ఎస్ ఎన్ని వ్యూహాలు రచిస్తుందో చెప్పాల్సిన పని లేదు. సి‌ఎం కే‌సి‌ఆర్ దగ్గర నుంచి చిన్న టి‌ఆర్‌ఎస్ నాయకుడు వరకు హుజూరాబాద్‌పైనే ఫోకస్ చేసి రాజకీయం చేస్తున్నారు. అటు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పేరిట వేల కోట్లు ఖర్చు పెట్టి హుజూరాబాద్ ప్రజలని ఆకట్టుకోవడానికి టి‌ఆర్‌ఎస్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అలాగే బలమైన నాయకులని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Huzurabad | హుజురాబాద్
Huzurabad | హుజురాబాద్

అటు ఈటలకు మద్ధతుగా ఉంటున్న నాయకులని సైతం టి‌ఆర్‌ఎస్‌లోకి తీసుకోచేస్తున్నారు. ఇక మంత్రి హరీష్ రావు అయితే హుజూరాబాద్‌లో టి‌ఆర్‌ఎస్ గెలుపు కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారో అంతా చూస్తూనే ఉన్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక విధాలుగా ఈటలని ఓడించడానికి టి‌ఆర్‌ఎస్ ప్రయత్నిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే హుజూరాబాద్‌లో ఈటలని ఓడించడానికి టి‌ఆర్‌ఎస్ పద్మవ్యూహం ప్లాన్ చేసింది.

కానీ ఈటల ఆ పద్మవ్యూహాన్ని చేధిస్తున్నట్లే కనిపిస్తోంది. హుజూరాబాద్‌లో టి‌ఆర్‌ఎస్ ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా సరే ప్రజలు మాత్రం తనవైపే ఉన్నారని ఈటల గట్టిగా నమ్ముతున్నారు. అలాగే టి‌ఆర్‌ఎస్ ఏం చేసినా అది ఈటల రాజేందర్  రాజీనామా చేయడం వల్లే జరుగుతుందని అక్కడి ప్రజలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈటల టి‌ఆర్‌ఎస్ పన్నిన పద్మవ్యూహాన్ని చేధిస్తూనే ఉన్నారు. అలా అని టి‌ఆర్‌ఎస్ వ్యూహాలు రచించకుండా ఉండటం లేదు.

ఎప్పుడుకప్పుడు కొత్త కొత్త వ్యూహాలతో వస్తూ హుజూరాబాద్‌ పోరులో ఉత్కంఠ రేపుతున్నారు. ముఖ్యంగా ట్రబుల్ షూటర్ హరీష్…తనదైన శైలిలో ఎత్తులు వేస్తూ, ఈటలకు చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఇక ఇన్నేళ్లు హరీష్‌తో స్నేహం చేసిన ఈటల సైతం… హరీష్ ఎత్తులని చిత్తు చేస్తున్నారు. హరీష్ ఎంతమంది నాయకులని టి‌ఆర్‌ఎస్‌లోకి తీసుకున్నా సరే, ఈటలకు ప్రజల్లో ఉండే ఆదరణని మాత్రం తగ్గించలేకపోతున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికైతే టి‌ఆర్‌ఎస్ పద్మవ్యూహాన్ని ఈటల చేధిస్తున్నట్లే కనిపిస్తోంది.