ఈటల రాజేందర్ డేరింగ్ పాలిటిక్స్…అప్పుడు చంద్రబాబు సక్సెస్..

-

సాధారణంగా రాజకీయ నాయకులు, తమ ప్రత్యర్ధులపై విమర్శలు చేస్తూ ఉంటారు. అప్పుడు ఉండే రాజకీయ కారణాలపై మాట్లాడతారు. అయితే ఊహించని రాజకీయ పరిస్తుతుల్లో విమర్శలు చేసిన నాయకులే, ప్రత్యర్ధి పార్టీల్లో చేరతారు. అలా చేరినప్పుడు గతంలో వారు మాట్లాడిన మాటలు బయటకొస్తాయి. ఇక ఇలాంటి విషయాల్లో చాలామంది నాయకులు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాత్రం ఆ పని చేయలేదు.

etela-rajender | ఈట‌ల‌ రాజేందర్
etela-rajender | ఈట‌ల‌ రాజేందర్

దశాబ్దాల పాటు టి‌ఆర్‌ఎస్‌లో పనిచేసిన ఈటల, కే‌సి‌ఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తూ, కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు ఉన్న పరిస్తుతులని బట్టి ఈటల, మోదీ ప్రభుత్వాన్ని తప్పుబట్టిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణకు  మోదీ ప్రభుత్వం పెద్దగా అండగా నిలబడలేదని అప్పటిలోనే మాట్లాడారు. అయితే ఇప్పుడు బి‌జే‌పిలోకి వచ్చాక ఈటలకు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి.

అప్పుడు మోదీ సర్కార్‌పై విమర్శలు చేయడంపై ఈటలకు కొన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే ఈ విషయంలో ఈటల మాట మార్చకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తున్నారు. గతంలో తెలంగాణకు అండగా మోదీ ప్రభుత్వం నిలబడలేదనే అంటున్నారు. కానీ అప్పుడు పక్కనే ఏపీలో అధికారంలో చంద్రబాబుకు మోదీ సర్కార్ సపోర్ట్ ఇచ్చిందని చెబుతున్నారు. మోదీ-చంద్రబాబులు పొత్తులో ఉండటంతో కేంద్ర ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వానికి కావాల్సిన పనులు చేసి పెట్టిందని, ఆ సమయంలో తెలంగాణకు కాస్త అన్యాయం జరిగిన మాట వాస్తవమే అని అంటున్నారు. మోదీ ప్రభుత్వం ద్వారా చంద్రబాబు కావాల్సిన పనులు చేసుకోవడంలో సక్సెస్ అయ్యారని మాట్లాడుతున్నారు.

అలాగే గతంలో అనేక విషయాల్లో మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఈటల, ఇప్పుడు వాటికి కట్టుబడి ఉన్నాననే విధంగా చెబుతున్నారు. మొత్తానికైతే మిగతా నాయకులు మాదిరిగా పార్టీ మారగానే మాట మార్చకుండా ఈటల డేరింగ్ పాలిటిక్స్ చేస్తున్నారనే చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news