జ‌గ‌న్ టూర్‌పైనే అంద‌రి ఆస‌క్తి.. మ‌రి స‌క్సెస్ అవుతుందా?

-

ఏపీ సీఎం జ‌గ‌న్ స‌డెన్‌గా ఢిల్లీ బాట ప‌ట్ట‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. దీనికంటే ముందు రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు వ‌రుస‌గా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై కేంద్ర మంత్రుల‌కు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ ఢిల్లీ వెళ్ల‌డం కాస్తా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇంకోవైపు ఆయ‌న బెయిల్ ర‌ద్దు అంశంపై కోర్టులో విచార‌ణ సాగుతోంది.

jagan/  జ‌గ‌న్

కానీ జ‌గ‌న్ మాత్రం ఢిల్లీకి వెళ్లింది కొన్ని అంశాల‌పై మాట్లాడ‌టానికే అంటూ తెలుస్తోది. అందులో మూడు రాజధానుల అంశం ప్ర‌ధానంగా ఉంది. అలాగే కర్నూలుకు హైకోర్టును త‌ర‌లించ‌డానికి రీ నోటిఫికేషన్ వేడ‌యం కూడా ఇంకోటి.

వీటితో పాటే పోలవరం ప్రాజెక్టు రివైజ్డు ఎస్టిమేట్స్ సంబంధిన విషాయ‌ల‌పై కేంద్రం ఆమోదం ఇవ్వాల‌నేది జ‌గ‌న్ ప్ర‌తిపాద‌న‌లు. వీటిపైనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో గంట‌న్న‌ర‌కు పైగా చర్చించారు. మోడీని క‌లిసి అన్ని అంశాల‌పై చ‌ర్చించేంత టైమ్ ఉండ‌దు కాబ‌ట్టి వాటిని అమిత్ షాతో చ‌ర్చించారు. అయితే వీట‌న్నింటిపై కేంద్రం కాస్తా సానుకూలంగానే ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news