మనం తీసుకొనే డైట్ చాలా ముఖ్యం. ఇది ఆరోగ్యంపైన చాలా ప్రభావం చూపిస్తుంది. ఇంఫ్లమేషన్ మొదలైన సమస్యలు కూడా దూరమవుతాయి. ఒంట్లో అనేక భాగాల లో ఇంఫ్లమేషన్ సమస్య ఉంటుంది. దీని కారణంగా ఆర్థరైటిస్, డిప్రెషన్, హృదయ సంబంధిత సమస్యలు, ఆస్తమా, జాయింట్ పెయిన్స్ మొదలైన సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.
డైట్ లో ఎటువంటి మార్పులు చేయాలి..?
ఇంఫ్లేమేషన్ సమస్య రాకుండా ఉండాలి అంటే ఎక్కువ మీ డైట్ లో గ్రైన్స్ ని తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల హెల్తీ బ్యాక్టీరియా పెరుగుతుంది. హెల్ది బ్యాక్టీరియా వల్ల ఇంఫ్లమేషన్ తగ్గుతుంది. ఈ గ్రైన్స్ ని ఆలివ్ ఆయిల్ తో కలిపి తీసుకుంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మరియు బ్లడ్ ప్రెషర్ తగ్గడం కొలెస్ట్రాల్ కంట్రోల్ లో ఉండడం వంటివి జరుగుతాయి.
అదే విధంగా గ్రీన్ టీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కూడా సమస్యలు రాకుండా చూసుకుంటుంది.
నట్స్ లాంటివి తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. సమోసా వంటి వాటిని తినే బదులు నట్స్ లాంటివి ఎక్కువగా తీసుకోండి. దీని వల్ల కూడా ఆరోగ్యం బాగుంటుంది.
బంగాళదుంప కి బదులుగా ఎక్కువ చేప, బ్రోకలీ తినండి. ఒమేగా త్రీ ఉన్న ఆహారం తీసుకోవడం కూడా మంచిది. బ్రోకలీ లో ఫైబర్, ఫోలేట్, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి.
అదే విధంగా ఎక్కువగా ఆహారంలో పండ్లు కూరగాయలు తీసుకుంటూ ఉండండి తద్వారా ఈ సమస్యలు మీకు ఉండవు.