అచ్చెన్నకు రక్తపోటు : ఉన్నట్టుండి కాళ్లు, చేతులు..!

-

కొద్దిరోజుల క్రితం ఈఎస్ఐ స్కాం కేసులో అరెస్టయిన టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు హయాంలో ఈఎస్ఐ మందుల కొనుగోళ్లకు సంబంధించి రూ.150 కోట్ల అవినీతి జరిగిందని విజిలెన్స్ నివేదిక ఇవ్వడంతో ఆయనను ఏసీబీ అరెస్ట్ చేసింది. అయితే అచ్చెన్నాయుడు ప్రస్తుతం గుంటూరులోని జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.

ఆయనకు నిన్న నిర్వహించిన వైద్య పరీక్షల్లో అధిక రక్తపోటు నమోదైంది. తనకు కాళ్లు, చేతులు తిమ్మిర్లుగా ఉన్నట్టు అచ్చెన్న వైద్యులకు చెప్పగా.. పరీక్షించిన నిపుణులు అవసరమైన మందులు సూచించారు. కాగా, ఈ నెల 17న అచ్చెన్నకు సర్వజన ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వహించిన సంగతి తెలిసిందే. అలాగే ఇటీవలే ఆయన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అటు, ప్రస్తుతం తమ వాదనలు వినాలని అచ్చెన్నాయుడు తరపు న్యాయవాది కోరగా.. బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్‌పై ఒకేసారి విచారించాలని ప్రభుత్వ అడ్వొకేట్ కోరారు. దీంతో విచారణ సోమవారానికి వాయిదా పడిన విషయం తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news