మాజీ తమ్ముళ్ళకు సీట్లు ఫిక్స్.!

-

బి‌ఆర్‌ఎస్ పార్టీలో ఇప్పుడు సీట్ల అంశంపై రచ్చ నడుస్తున్న విషయం తెలిసిందే. సి‌ఎం కే‌సి‌ఆర్ సీట్ల పంపకాలపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. దాదాపు అభ్యర్ధుల ఎంపిక చేశారని తెలుస్తోంది. సీటు రాని వారికి సర్దిచెప్పే కార్యక్రమం కూడా చేస్తున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వడం లేదని తేల్చేశారు. దాదాపు 15 మంది వరకు బి‌ఆర్‌ఎస్ సిట్టింగులకు సీటు ఇవ్వడం లేదని తెలిసింది.

అయితే 2014 తర్వాత టి‌డి‌పి నుంచి వచ్చి బి‌ఆర్‌ఎస్ లో హవా కొనసాగిస్తున్న మాజీ తమ్ముళ్ళకు దాదాపు సీటు ఫిక్స్ అయిపోయిందని తెలుస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని తమ్ముళ్ళకు సీట్లు ఖాయమైనట్లు సమాచారం. గ్రేటర్ లో కేవలం ఉప్పల్, ముషీరాబాద్,ఎల్బీనగర్ సీట్ల విషయంలోనే కాస్త క్లారిటీ లేదు. మిగతా సీట్లు దాదాపు సిట్టింగులకే ఫిక్స్ అని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మాజీ తెలుగు తమ్ముళ్ళు అయిన కొందరిని సీట్లు ఫిక్స్ అయిపోయాయని తెలిసింది.

 

శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీ, కూకట్‌పల్లిలో మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ లో వివేకానంద, జూబ్లీహిల్స్‌లో మాగంటి గోపినాథ్, సనత్‌నగర్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజేంద్రనగర్ లో ప్రకాష్ గౌడ్, ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి లేదా ఆయన తనయుడుకు సీటు దక్కుతుందని తెలిసింది. అటు ఖమ్మంలో మాజీ తమ్ముళ్ళు..సత్తెనపల్లిలో వీరయ్య, అశ్వరావుపేటలో మెచ్చా నాగేశ్వరరావు, పరకాలలో చల్లా ధర్మారెడ్డి, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు..ఇలా మాజీ తమ్ముళ్ళకు బి‌ఆర్‌ఎస్ లో సీట్లు ఖాయమయ్యాయి.

ఇక స్టేషన్ ఘనపూర్ సీటు కడియం శ్రీహరికి దక్కనుందని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లోనే బి‌ఆర్‌ఎస్ మొదట లిస్ట్ విడుదల కానుంది. ఆ లిస్ట్ లో ఎవరి పేర్లు వస్తాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news