దేశం దృష్టిని ఆకర్శించిన రైతులు ఆందోళన..కేంద్రానికి పతనం

-

భారత్‌లో గత కొంత కాలంగా నిశ్శబ్ద పోరాటం జరుగుతుంది..కార్పొరేట్ మీడియా ఆ పోరాటంపై ఫోకస్‌ పెట్టకపోవడంతో పెద్దగా ప్రచారంలోకి రాలేకపోయింది..ఇటీవలే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులు తీవ్ర ఆందోళన చేస్తున్నారు..నెల రోజులుగా రైలతలు ఆందోళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది..రైతు అభిప్రాయాలు తీసుకోకుండానే కొత్త చట్టాలు తెచ్చిన మోడీ ప్రభుత్వం..రైతుల నోట్లో మట్టికొట్టారంటున్నారు రైతుసంఘాల నేతలు..కార్పోరేట్ వర్గాలకు అనుకూలంగా ఉంటే సవరణలు చట్టంలో తీసుకువచ్చారని..దీంతో రైతు తీవ్రంగా నష్టపోవల్సి వస్తుందంటున్నారు.

రైతే రాజు అనే అనే నినాదంతో రైతులను ఒక మూసపద్దతిలో బందీకాన చేశారు పాలకులు..రైతును రాజులో పోల్చీ వారిని గొప్ప స్థాయి కల్పించనట్లు చెప్పుకొచ్చిన పాలక వర్గాలు..రైతులను ఐకమత్యం కాకుండా చేస్తున్నారు..వారి హక్కుల కోసం..ముఖ్యంగా మద్దతు ధర, నాణ్యమైన విత్తనాలు, మార్కెట్ సౌకర్యాలు,దళారుల దోపిడిపై సమిష్టి పోరాటం చేయకుండా అన్ని ప్రభుత్వాలు సఫలం అయ్యారు..ఇప్పుడు ఎన్ని రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చిన వారిలో అనైక్యత వల్ల పాలకులు వెనక్కి తగ్గడంలేదిని స్పష్టంగా కనిపిస్తుంది.పంజాబ్‌ రైతుల ఆందోళనలను పట్టికోకపోవడమే అందుకు ప్రత్యేక్ష ఉదాహరణ..కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాలపై గత కొంత కాలంగా రైతులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు..రైల్‌ రోకో..సడక్‌ బంద్,ఛలో ఢిల్లీ వంటి వినూత్నరూపంలో నిరసనలు చేస్తున్నారు..అయిన కేంద్రానికి చీమకుట్టినట్లు కూడా లేదు..అంతర్గతంగా రాజకీయ ఒత్తిడిలో ఉన్న మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది..కొత్త చట్టాలను వెనక్కి తీసుకుంటే ప్రతి పక్షాల చేతిలో నైతికంగా పోడియినట్లు అవుతుందని..రాజకీయ ఈగోతో రైతులను బలితీసుకుంటున్నారు పాలకపక్షాలు..

మరోవైపు కేంద్రం తీరులో మార్పు రావకపోవడంతో రైతుల నిరసన రూపం మరింత సటిష్టం అయింది..ఎట్టిపరిస్థితిలో వెనక్కి తగ్గేది లేదని..పట్టుదలతో పోరాడుతున్నారు..రాజకీయ నాయకులు ఎన్ని రకాల ప్రలోభాలకు, బెదిరింపులకు గురిచేసిన రైతుల మాత్రం వెనక్కి తగ్గడం లేదు కదా..మరింత పోరాట స్పూర్తిని కొనసాగిస్తున్నారు..రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో రైతులను ఒక ఓటర్లుగా మాత్రమే గుర్తించి..అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యలను పట్టించుకోవడం మానేశారు..అందుకు పంజాబ్‌ రైతులు రాజకీయ నాయకుల ఉచ్చులో పడకుండా స్వతంత్రంగా ఉద్యమిస్తున్నారు.పంజాబ్‌,హర్యానా రైతులు చేస్తున్న పోరాటానికి దేశ వ్యాప్తంగా రైతులు వద్దతు తెలుపుతున్నారు..ఒక్క రైతులే కాదు.కార్మికులు,ప్రజా సంఘాలు, మేధావులు,లాయర్లు, జర్నలిస్తులు..ఇంకా ఇతర అనేక వర్గాల నుంచి మద్దతు పెరుగుతుంది..కేంద్ర ప్రభుత్వం నిరంకుశ పోడకలపై కదం తొక్కిన రైతులతో పాటు కార్మిక సంఘాలు ఈ నెల 26,27న జాతీయ స్థాయి సమ్మెకు పిలుపునిచ్చారు..మొదటి రోజు సమ్మె చాలా ప్రాంతంలో హిసాంత్మకంగా మారింది..ముఖ్యంగా పంజాబ్-హర్యానా సరిహద్దు రణరంగంగా మారింది..రైతుల ఛలో ఢిల్లీకి పిలుపునివ్వడంతో అప్రమత్తమైన కేంద్రం రైతులను సరిహద్దులో అడ్డుకున్నారు..ఆందోళనకారులు అక్కడే కూర్చోని..రోడ్‌పైనే బ్లాక్ చేశారు..బారీకేడ్‌లను తోసుకుని వెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లు ప్రయోగించారు..

ఒకానునోక సమయంలో వాటర్‌ క్యానన్లతో రైతులు ఢీ అంటే ఢీ అనేలా రోడ్‌పైనే పడుకున్నారు..వారి పోరాట స్ఫూర్తికి దేశ మొత్తం తల వంచుకుంది..రైతులు చేస్తున్న పోరాటానికి దూరంగా ఉన్న వారు అవమానంతో తల దించకుంటున్నారు..సమాజానికి అన్నం పెట్టే రైతుకు మద్దతు ఇవ్వపోవడం అవమానంగా భావిస్తున్నారు..మరోవైపు రైతులు చేస్తున్న పోరాట స్ఫూర్తి దేశంలో ఉన్న ప్రజా సంఘాలకు, రాజకీయ పార్టీలకు,ప్రజా ఉద్యమకారులకు సవాల్ విసురుతుంది..దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే వ్యవసాయాన్ని,రైతులను నిర్లక్ష్యం చేస్తున్న ఎందుకు మాట్లాడం లేదని..మతతో ఆందోళనలో ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నిస్తున్నారు.
నూతన ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చిన తర్వాత ప్రజ ఉద్యమాలను కఠనంగా అనచివేస్తున్నాయి ప్రభుత్వాలు..ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన లాఠీ చార్జ్‌లు, వాటర్‌ క్యానన్లు చేదరగొట్టం..వారిపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయడం సాధారణంగా జరుతుంది..ఇలాంటి పరిస్థితిలో పంజాబ్‌ రైతుల ఉద్యమం దేశ ప్రజలందరికి స్ఫూర్తిగా నిలుస్తుందంటున్నారు విశ్లేషకులు.భవిష్యత్‌లో రైతుల పోరాటంతో ప్రభుత్వం దిగి వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు..రైతు ఆందోళనపై కేంద్రం సీరియస్‌గా తీసుకోకపోతే దేశంలో ఆర్థికంగా,రాజకీయంగా సంచలన మార్పులు రావచ్చు అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు..రైతుల పోరాటం దేశ వ్యాప్తంగా విస్తరిస్తే మోడీ ప్రభుత్వానికి కష్టాలు తప్పవంటున్నారు సామాజిక కార్యకర్తలు.

Read more RELATED
Recommended to you

Latest news