ఆవిర్భావ వేళ : సినిమా చూపిస్త‌డ‌ట లోకేశ్ బాబు !

-

రాజ‌కీయం వేరు సినిమా వేరు అని రాయొద్దు..ఆ రెండూ ఒక్క‌టే.. సినిమా వాడి పార్టీగా తెలుగుదేశం పార్టీ అవ‌త‌రించి త‌రువాత ఫ‌క్తు కార్పొరేట్ పార్టీగా మారిపోయింది. కానీ రాజ‌కీయాల్లోకి వ‌స్తూ వ‌స్తూనే కార్పొరేట్ శ‌క్తుల సాయంతోనే వ‌చ్చి పార్టీ పెట్టారు వైఎస్ జ‌గ‌న్..ఇంతే తేడా! జ‌గన్ కూడా ఫిల్మ్ ప్రొడ‌క్ష‌న్ అంటే ఇష్టం.క‌నుక సినిమా త‌ర‌హాలోనే స్క్రీన్ ప్లే టెక్నిక్ లు ఉప‌యోగించి రాజ‌కీయం చేస్తుంటారు.ఆయ‌నెక్కువ‌గా సురేంద‌ర్ రెడ్డి ( అత‌నొక్క‌డే డైరెక్ట‌ర్) ఫార్ములాను వాడుతుంటారు. ఆ విధంగా ఇంత‌వ‌ర‌కూ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ సినిమా చూపించాడు. ఇప్పుడు లోకేశ్ వంతు  వ‌చ్చింది. ఆయ‌న కూడా సినిమా చూపిస్త మామా అంటూ పాడుతున్నాడు. పెద్దాడ‌యిన జ‌గ‌న్ ను పిల్లాడ‌యిన లోకేశ్ ఢీకొన‌డం సాధ్య‌మా!


వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ రెడ్డి పార్టీకి చుక్కలు చూపిస్తాన‌ని చిన‌బాబు శ‌ప‌థం చేశారు. ఎన్నిక‌లకు మ‌రో రెండేళ్ల దూరం ఉంద‌ని క‌నుక అంతా స‌మ‌ష్టిగా కృషి చేసి పార్టీ ని అధికారంలోకి తీసుకుని రావాల‌ని  పిలుపునిచ్చారు. రానున్న కాలంలో వైసీపీకి సినిమా చూపిస్తాన‌ని  బ‌హిరంగ స‌వాల్ విసిరి మ‌రో సంచ‌ల‌నం అయ్యారు.

దీంతో చిన‌బాబు ఫైర్ వెనుక అధినేత చంద్ర‌బాబు వ్యూహం ఉంద‌ని తేలింది. ఎన్టీఆర్ దేవుడు అయితే చంద్ర‌బాబు రాముడు కానీ నేను మూర్ఖుడ్ని ఎవ్వ‌రినీ వ‌దిలిపెట్ట‌ను అని ప‌దే ప‌దే హెచ్చ‌రిక‌లు కూడా ఇచ్చారు. అంటే రివెంజ్ పాలిటిక్స్ ను లోకేశ్ కూడా ప్లే చేయ‌బోతున్నార‌న్న‌మాట! దీంతో వ‌చ్చేసారి కూడా ఇరు పార్టీలూ త‌న్నుకుని తిట్టుకుని విలువైన పాల‌న సంబంధ కాలాన్ని వృథా చేసుకుంటాయ‌ని కూడా తేలిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news