బాబు బాటలో కేసీఆర్.. ఫ్యూచర్ కనబడుతుంది?

-

ఎప్పుడైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సఖ్యతతో ముందుకెళ్లాలి…అప్పుడే రాష్ట్రాలు, దేశం ముందుకెళుతుంది. రాజకీయ పరమైన విభేదాలు ఉన్నా సరే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలి…అప్పుడు అన్నీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఒకరినొకరు రాజకీయ పరంగా ముందుకెళితే చిక్కులు తప్పవు. ఈ విషయంలో రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకు బొక్క పడుతుంది. ఎందుకంటే కేంద్రమనే కొండని ఢీకొట్టేప్పుడు ఆచితూచి అడిగేయాలి. పార్టీల పరంగా కొట్లాడుకోవచ్చు…కానీ ప్రభుత్వాల పరంగా కొట్లాడితే రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకే దెబ్బ పడుతుంది.

ఆ దెబ్బలు ఎలా ఉంటాయో టీడీపీ అధినేత చంద్రబాబుకు బాగా తెలుసు…2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు…2019 ఎన్నికల ముందు బీజేపీ పొత్తు నుంచి బయటకొచ్చి ఆయన చేసిన ఫీట్లు అందరికీ తెలిసిందే. తాను ఎలాగో రాష్ట్రంలో అధికారంలో ఉన్నాను కాబట్టి ఏం చేసిన తిరుగుండదని అనుకున్నారు..ప్రత్యేక హోదా అంశంలో కేంద్రంపై ధర్మపోరాట దీక్షలు అంటూ తెగ పోరాటాలు చేశారు. మోదీ, అమిత్ షాలని తెగ తిట్టారు.

దీని వల్ల ఏం ఒరిగింది…ఆ పోరాటాలు వృధా అయ్యాయి…బాబుకు బొక్క పడింది. 2019 ఎన్నికల్లో ఓడిపోయి రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తిన్నారు. ఇప్పటికీ కోలుకోలేదు. అందుకే ఇప్పుడు బీజేపీకి దగ్గరవ్వాలని చూస్తున్నారు. ఇక ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ సైతం…బాబు బాటలో నడవటం మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది.

తెలంగాణలో బీజేపీ ఎదుగుతున్న నేపథ్యంలో ఇంకా లాభం లేదనుకున్న కేసీఆర్…కేంద్రంపై పోరాటం మొదలుపెట్టారు. వడ్లు కొనుగోలు చేయాలని అధికార టీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు దిగింది. ప్రతిపక్షాలు ధర్నాలు చేస్తే బాగానే ఉంటుంది…కానీ అధికారంలో ఉన్న పార్టీలు ధర్నాలు, దీక్షలు అని చేస్తే ఏం అవుతుందో చంద్రబాబుకు బాగా తెలుసు. ఇప్పుడు కేసీఆర్ అదే పనిచేస్తున్నారు. అంటే రాజకీయంగా ఇబ్బందులు పడతామేమో అని కేసీఆర్ భయపడి…ఇలా ప్రజల్లోకి వచ్చి ధర్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక కేంద్రంపై పోరాటాలు గానీ వికటిస్తే బాబు పరిస్తితే కేసీఆర్‌కు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి చూడాలి కేసీఆర్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో?

Read more RELATED
Recommended to you

Latest news