గడపగడపకు తిరగకపోతే ఎమ్మెల్యేల గ్రాఫ్ డౌన్ అయినట్లేనా..దాని బట్టే ఎమ్మెల్యేల పనితీరు ఆధారపడి ఉందా? అంటే అసలు కాదనే చెప్పాలి. గడపగడపకు అనేది కేవలం ప్రభుత్వ పథకాలు అందుతున్న లబ్దిదారులని ఎమ్మెల్యేలు కలిసి..మీకు ఇంత మేలు జరుగుతుంది కాబట్టి, తమకు మద్ధతుగా ఉండాలని ప్రజలని ఎమ్మెల్యేలు కోరడం చేస్తున్నారు దాంతో ఎమ్మెల్యే గ్రాఫ్ డిసైడ్ చేయడానికి లేదు. ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగానే వారి గ్రాఫ్ ఆధారపడి ఉంటుంది.
కాకపోతే జగన్ గడపగడపకు వెళ్ళడం కూడా ముఖ్యమనేది చెబుతున్నారు. అలా ప్రజల్లో తిరిగితే ఎమ్మెల్యేలకే బెనిఫిట్ అనేది జగన్ ఉద్దేశం..అందుకే గడపగడపకు అందరూ వెళ్లాలని చెబుతూ ఉంటారు. అయితే తాజా సమావేశంలో అసలు 18 మంది పెద్దగా గడపగడపకు వెళ్ళడం లేదని జగన్ చెప్పుకొచ్చారు. వారితో తాను వ్యక్తిగతంగా మాట్లాడతానని అన్నారు. ఇక ఎమ్మెల్యేల పనితీరు బాగోకపోతే వారికి సీటు ఇవ్వనని అన్నారు. అంటే ఇక్కడ గడపగడపకు వేరు, పనితీరు వేరు. పనితీరు అంటే నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు..ప్రజల సమస్యలు పట్టించుకుంటున్నారా? ఎంతవరకు అభివృద్ధి చేస్తున్నారనేది కీలకం.
అలా చేయని వారికే సీట్లు ఇవ్వనని జగన్ చెబుతున్నారు. అంతే తప్ప గడపగడపకు వెళ్లకపోతే సీట్లు రావని కాదు..వారు ఓడిపోతారని కాదు. ఉదాహరణకు కొడాలి నాని గడపగడపకు పెద్దగా తిరగడం లేదని వైసీపీ అంతర్గత సర్వేలో తేలింది. ఇప్పటికే పలుమార్లు కొడాలి పేరు జగన్ ప్రస్తావించారు. అలా అంటే కొడాలికి సీటు ఇవ్వకుండా ఉండటం కష్టం..అలాగే ఆయన గెలుపుకు సంబంధం లేదు. ఏం చేసిన గుడివాడలో మళ్ళీ కొడాలి గెలుస్తారు..కాబట్టి పనితీరు బాగోని వారికే జగన్ చెక్ పెట్టనున్నారు. వారిని మార్చేసే అవకాశాలు ఉన్నాయి. ఎంతమంది ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వరో చూడాలి.