నేడు గోవా సీఎంగా ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం…. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులుహజరు

-

గోవా సీఎంగా నేడు ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ ప్రభుత్వం వరసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ప్రమోద్ సావంత్ వరసగా రెండో సారి సీఎంగా పదవీ బాధ్యతలు తీసుకోనున్నారు. 2012 ఎన్నికల నుంచి వరసగా బీజేపీనే గెలుస్తూ వస్తోంది. మనోహర్ పారికర్, లక్ష్మీకాంత్ పర్సేకర్, ప్రమోద్ సావంత్ ఇలా బీజేపీ తరుపున గోవాకు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. తాజాగా ఈరోజు ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

ఈ రోజు గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీతో పాటు ఇతర కేంద్ర మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పంజాబ్ మినహా… గోవా, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. గోవాలో 40 స్థానాలకు గానూ… 20 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ కు కేవలం ఒకే స్థానానికి దూరంలో నిలిచింది. అయితే స్వతంత్రులతో పాటు మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ మద్దతును ప్రకటించాయి. దీంతో మరోసారి గోవాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news