మార్కెట్ లోకి ఎన్ని ఫోన్లు వచ్చినా.. శాంసంగ్ కంపెనీకి ఉండే ఫ్యాన్ బేస్ వేరుంటుంది. వారెప్పుడూ.. ఎన్ని ఫోన్లు మార్చినా.. శాంసంగ్ లో వర్షన్స్ నే ఎంచుకుంటారు కానీ.. వేరే కంపెనీ ఫోన్స్ మీదకు వారి మనసు పోదు. తాజాగా… శాంసంగ్ సంస్థ మూడు “ఏ” సిరీస్ స్మార్ట్ ఫోన్లను భారత్ లో ప్రవేశపెట్టిన సంగతి మనకు తెలిసిందే. గెలాక్సీ ఏ53 5జీ, ఏ73 5జీ ,ఏ33 5జీ స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టారు.
ధర విషయానికొస్తే 6 + 128 స్టోరేజ్ వేరియంట్ ధర రూ .34,499గానూ 8 + 128 స్టోరేజ్ వేరియంట్ ధర రూ .35,999గానూ నిర్ణయించారు. శామ్సంగ్ గెలాక్సీ ఎ53 5జి బ్లాక్, వైట్, లైట్ బ్లూ మరియు పీచ్ అనే నాలుగు అద్భుతమైన కలర్ ఆప్షన్లలో వస్తుంది.
హైలెట్స్..
శామ్సంగ్ గెలాక్సీ ఏ53 5జీ స్మార్ట్ఫోన్లో 6.5 అంగుళాల FHD+ సూపర్ AMOLED డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కలిగి ఉన్నాయి.
గెలాక్సీ ఎ-సిరీస్లో మొదటిసారిగా 5Nm ఎక్సినోస్ 1280 చిప్ సెట్ ను అమర్చారు.
ఈ ఫోన్ ర్యామ్ ప్లస్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది, దీంతో ఐడియల్ ర్యామ్ సామర్థ్యాన్ని 16 జిబి వరకు ఉపయోగించుకుంచుకోవచ్చు.
25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000mAh బ్యాటరీ ఈ ఫోన్లో ఉంది.
25W ఛార్జర్ తో కేవలం 30 నిమిషాల్లోనే ఈ ఫోన్ 50 శాతం ఛార్జ్ పొందగలదని శాంసంగ్ తెలిపింది.
శామ్సంగ్ గెలాక్సీ ఎ53 5జిలో వెనుక భాగంలో OIS సాంకేతికతతో 64MP + 12MP + 5MP + 5MP క్వాడ్ కెమెరా సెటప్ కలిగి ఉంది.
ముందువైపు సెల్ఫీల కోసం 32 MP కెమెరా అమర్చారు. అన్నిటికి మించి ఆండ్రాయిడ్ 12OS తో వస్తున్నఈ గెలాక్సీ ఏ53 5జీ స్మార్ట్ ఫోన్ కు నాలుగేళ్ళ పాటు OS అప్డేట్ ఇస్తున్నట్టు శాంసంగ్ ప్రకటించింది.
శాంసంగ్ గెలాక్సీ ఏ33 5జీ ధర
శాంసంగ్ గెలాక్సీ ఏ33 5జీ స్మార్ట్ ఫోన్ ధర 369 యూరోల (సుమారు రూ.31,000) నుంచి ప్రారంభం కానుంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలోనే ఈ ఫోన్ కూడా కొనుగోలు చేయవచ్చు. అసమ్ బ్లాక్, అసమ్ బ్లూ, అసమ్ పీచ్, అసమ్ వైట్ రంగుల్లోనే ఇవి అందుబాటులో ఉన్నాయి.