హుజూరాబాద్‌లో హరీష్ మ్యాజిక్.. బండి లాజిక్…

-

హుజూరాబాద్ ఉపఎన్నిక పోరుకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ…ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతున్నాయి. ఎన్నికల ప్రచారం నలుగురు రోజుల్లో ముగియనుండటంతో టి‌ఆర్‌ఎస్, బి‌జే‌పి, కాంగ్రెస్‌లు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ప్రధానంగా బి‌జే‌పి-టి‌ఆర్ఎస్‌ల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా నడుస్తోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అలాగే టి‌ఆర్‌ఎస్ వాళ్లేమో కేంద్రంలోని బి‌జే‌పి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తుంటే, బి‌జే‌పి వాళ్లేమో రాష్ట్రంలోని టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు.

harish rao | హరీష్ రావు
harish rao | హరీష్ రావు

ఈ క్రమంలోనే హుజూరాబాద్‌లో టి‌ఆర్‌ఎస్ గెలుపు కోసం హరీష్ ఏ స్థాయిలో ప్రచారం చేస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. ఆయన తెలివిగా ఈటల రాజేందర్‌ని టార్గెట్ చేస్తే పని అవ్వదని చెప్పి, బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. అప్పుడే ఈటలకు నెగిటివ్ అవుతుందని అనుకుంటున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచేసిందని హడావిడి చేస్తున్నారు. అలాగే దళితబంధుని బీజేపీనే అడ్డుకుందని మాట్లాడుతున్నారు. అంటే తన మాటలతో మ్యాజిక్ చేసి, బీజేపీని నెగిటివ్ చేయాలని హరీష్ చూస్తున్నారు.

కానీ హరీష్ మ్యాజిక్ మాటలకు బీజేపీ లాజిక్‌లతో చెక్ పెట్టేస్తుంది. ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ రేట్ల విషయంపై బీజేపీ నేతలు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అయితే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్….హుజూరాబాద్ ప్రచారంలో సూపర్ లాజిక్‌తో హరీష్‌కు చెక్ పెట్టేశారు. అసలు పెట్రోల్, డీజిల్ రేట్ల విషయంలో కేంద్రం ట్యాక్స్, రాష్ర్టం ట్యాక్స్ ఉంటుందనే సంగతి తెలిసిందే. ఆ విషయం హరీష్ రావు చెప్పకుండా కేంద్రంపై ఫైర్ అవుతున్నారు. అందుకే బండి కూడా రాష్ట్రం పెట్రోల్‌పై విధించిన రూ.41 ట్యాక్స్ తగ్గించుకోమని కౌంటర్ ఇచ్చారు. లీటర్ పెట్రోల్ పై రూ.41 దోచుకుంటున్నది కేసీఆర్ ప్రభుత్వమే అని ఫైర్ అయ్యారు.

పైగా ఎన్నికల సమయంలో పథకాలు అమలు అవ్వవనే లాజికి హరీష్‌కు తెలిసి కూడా దళితబంధు బీజేపీనే ఆపేసిందని ప్రచారం చేస్తున్నారు. కానీ జనం హరీష్ ప్రచారాన్ని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. కేవలం వారు ఈటలనే చూస్తున్నారు తప్ప, విమర్శలని వినడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news