ఆ విషయంలో జగన్ రికార్డు క్రియేట్ చేశారా ?

-

ఉమ్మడి ఏపీలో వైఎస్సార్ కి ఒక రికార్డు ఉంది. ఆయన పూర్తి ఐదేళ్ళ కాలం సీఎం పదవిలో కొనసాగారు. మరోసారి ఎన్నికలకు వెళ్ళి సీఎం గా ప్రమాణం చేశారు. అలా మూడు నెలల పాలన సాగుతూండగా 2009 సెప్టెంబర్ 2న వైఎస్సార్ ప్రమాదవశాత్తు మరణించారు. ఇక విభజన ఏపీలో చూస్తే ఇప్పటి దాకా ఇద్దరు సీఎంలు అయ్యారు. వారిలో ఒకరు చంద్రబాబు అయితే రెండవవారు జగన్. ఈ ఇద్దరిలో చంద్రబాబు కూడా అయిదేళ్ళూ పాలించారు. కానీ టెక్నికల్ గా చూస్తే ఆయన అయిదేళ్ళ పూర్తి కాలం కొనసాగించలేకపోయారు. అదెలా అంటే 2014లో జూన్ 8న చంద్రబాబు సీఎం గా ప్రమాణం చేశారు. అయితే 2019 జూన్ 8 కంటే ముందే ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దానికి పది రోజుల ముందు అంటే 2019 మే 30న జగన్ సీఎం గా ప్రమాణం చేయడంలో బాబు అక్షరాలా 1815 రోజులు మాత్రమే సీఎం గా పనిచేశారు. అలా అయిదేళ్ళకు పది రోజులు తేడా వచ్చింది.

ఇదిలా ఉంటే జగన్ విషయం తీసుకుంటే ఆయన 2019 మే 30న సీఎం గా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం లో బాధ్యతలు స్వీకరించారు. అయిదేళ్ళు గిర్రున తిరిగి 2024 మే 30 వచ్చేనాటికి కూడా ఆయనే సీఎం గా ఉన్నారు. అంతే కాదు జూన్ 4న ఫలితాలు వస్తాయి. దాంతో పాటుగా జగన్ గెలిస్తే ఆయన కొనసాగుతారు. లేదా వేరే ప్రభుత్వం వచ్చి బాధ్యతలు స్వీకరించే వరకు ఉంటారు. ఒక వేళ బాబే సీఎం గా ప్రమాణం చేసినా జూన్ 9 లేదా 11 అని డేట్స్ ఇస్తున్నారు. అలా చూసుకుంటే మరో పది రోజులు కలుపుకు 1835 రోజుల పాటు జగన్ సీఎం గా ఉన్నట్లు అవుతుంది. ఇక ఉమ్మడి ఏపీని విభజన ఏపీని ఏలిన సీఎంలలో అత్యధిక కాలం పాలిచిన వారి జాబితా తీసుకుంటే మొదటి పేరు చంద్రబాబుకు దక్కుతుంది. ఆయన ఏకంగా 13 ఏళ్ళ 245 రోజుల పాటు సీఎం గా పనిచేసారు

ఆ తరువాత ప్లేస్ లో కాసు బ్రహ్మానందరెడ్డి ఏడేళ్ళ 221 రోజులు, మూడవ ప్లేస్ లో నందమూరి తారక రామారావు ఏడేళ్ళ 195 రోజులు, నాలుగవ ప్లేస్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 5 ఏళ్ళ 111 రొజులు ఉంటే అయిదవ ప్లేస్ లో నీలం సంజీవరెడ్డి 5 ఏళ్ళ 51 రోజులు ఉన్నారు. Also Read – రాష్ట్ర గీతంగా ‘జయజయహే తెలంగాణ’ ఇక ఆరవ ప్లేస్ లో వైఎస్ జగన్ 2024 మే 30 నాటికి లెక్క ప్రకారం చూస్తే అయిదేళ్ళు పూర్తి చేసుకున్నారు. మళ్లీ ఆయన గెలిస్తే ఇది డబుల్ అవుతుంది. లేకపోయినా మరో పది రోజులు ఆయన ముఖ్యమంత్రిత్వం పదవీకాలంలో జతకలసి 5 ఏళ 10 రోజులు అవుతుంది. మొత్తానికి చూస్తే ఉమ్మడి ఏపీలో విభజన ఏపీలో మొత్తం 19 మంది చీఫ్ మినిస్టర్లు పాలిస్తే అందులో ఈ రోజుకు అరవ ప్లేస్ లో జగన్ అత్యధిక పాలన చేసిన సీఎం ల లిస్ట్ లో ఉన్నారు. రెండవ టెర్మ్ గెలిస్తే మాత్రం ఆయన చంద్రబాబు తరువాత ప్లేస్ లోకి వెళ్తారు. అంటే నంబర్ టూ ప్లేస్ అన్న మాట. చూడాలి మరి జూన్ 4 ఫలితం ఏమి చెబుతుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version