ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీకి కాస్త పట్టు ఉన్న జిల్లా…గత ఎన్నికల్లో కాస్త చేదు ఫలితాలు వచ్చినా..ఈ సారి మాత్రం పక్కాగా సత్తా చాటాలని చెప్పి టీడీపీ ప్రయత్నిస్తుంది. అయితే ఈ సారి జిల్లాలో మంచి ఫలితాలు సాధించే దిశగానే చంద్రబాబు వ్యూహాలు పన్నుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఊహించని మార్పులకు తెరలేపుతున్నారని ప్రచారం జరుగుతుంది. కొందరు సీనియర్లకు సీట్లు ఇవ్వకుండా పక్కన పెట్టి..మరికొందరు సీట్లని మారుస్తారని ప్రచారం వస్తుంది.
మొదట మైలవరంపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి వచ్చి పోటీ చేస్తారని ప్రచారం ఉంది. అక్కడ ఉన్న దేవినేని ఉమాని గన్నవరం లేదా గుడివాడకు పంపుతారని అంటున్నారు. అవసరమైతే సీటు ఉండకపోవచ్చు అని ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఎంపీ కేశినేని నాని సైతం టీడీపీ గెలుపు కోసం తనతో సహ సీనియర్లు సీట్లు త్యాగం చేయాలని స్టేట్మెంట్ ఇచ్చారు. దాని బట్టి చూస్తే కేశినేని నానికి సీటు డౌటే అని తెలుస్తోంది. విజయవాడ పార్లమెంట్ లో ఆయన సోదరుడు కేశినేని శివనాథ్ పోటీ చేస్తారని టాక్.
ఇక కేశినేని నాని కుమార్తె శ్వేత విజయవాడ వెస్ట్‌లో పోటీ చేస్తారని అంటున్నారు. అటు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా సైతం వెస్ట్ పైనే ఆశలు పెట్టుకున్నారు. అలాగే పొత్తు ఉంటే ఆ సీటు జనసేనదే అంటున్నారు. విజయవాడ సెంట్రల్ లేదా బందరు ఎంపీగా వంగవీటి రాధా పోటీ చేస్తారని ప్రచారం చేస్తున్నారు.
ఇలా ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ నేతల సీట్ల మార్పుపై రకరకాల ప్రచారాలు వస్తున్నాయి. కానీ వీటిలో ఏ అంశం కూడా రియాలిటీకి దగ్గరగా కనిపించడం లేదు. అయితే పరిస్తితులని బట్టి ఎన్నికల సమయంలోనే చంద్రబాబు సీట్లు డిసైడ్ చేసే అవకాశాలు ఉన్నాయి.