హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ని దెబ్బతీయడానికి అధికార టీఆర్ఎస్ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసింది….హుజూరాబాద్‌లోని ప్రతి గడపని అడిగితే చెప్పేస్తుంది. ఒకటి అని కాదు…అనేక విధాలుగా ఈటలకు చెక్ పెట్టడానికి గులాబీ పార్టీ ఎత్తుగడలు వేసింది…ఎక్కడకక్కడ ఈటలని దెబ్బతీయడానికి చూసింది…అయితే ఎన్నికల ప్రచారం ముగిసిన కూడా వదలకుండా టీఆర్ఎస్ శ్రేణులు…ఈటలని టార్గెట్ చేసి ముందుకెళుతున్నాయి.
ఈ క్రమంలోనే ఈటలని ఓడించడానికి గులాబీ బాస్ తీసుకొచ్చిన దళితబంధు సరిగ్గా వర్కౌట్ కాకపోవడం, పైగా ఎన్నికల సంఘం నిబంధనలతో ఆ పథకానికి బ్రేక్ పడింది. ఈ పథకంలో విషయంలో గులాబీ పార్టీ, ఈటలపై విష ప్రచారం మొదలుపెట్టింది. దళిత బంధు పథకం ఆగిపోవడానికి కారణం ఈటలనే అని చెప్పి మరో ఫేక్ లెటర్ సృష్టించారు. తాజాగా ఆ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దళితబంధు నిలిపివేతకు ఈటల రాసిన లేఖనే కారణమని కేంద్ర సమాచార శాఖ.. మోహన్ అనే వ్యక్తికి వివరణ ఇచ్చినట్లుగా ఒక లేఖ బయటకొచ్చింది. అసలు ఆ లెటర్ చూస్తే పూర్తిగా ఫేక్ లెటర్ అని తెలుస్తోంది. పైగా ఆ లెటర్ కేవలం టీఆర్ఎస్ సోషల్ మీడియా గ్రూపుల్లోనే ప్రచారం అవుతుంది…అంటే దీని బట్టి చూస్తే అది టీఆర్ఎస్ సృష్టి అని అర్ధమవుతుంది. ఇక దీనిపై ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఫేక్ లెటర్ సృష్టించిన వారిపై చర్యలు తీసుకునేందుకు చూస్తుంది.
అయితే టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్ ప్రజలు ఈటల వైపే ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే జనం..పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిని చూసి ఓటు వేస్తామని క్లారిటీ ఇచ్చేస్తున్నారు. ఇక ఈటల ఇప్పటివరకు తమకు ఎలా అండగా ఉన్నారో విషయంపై కూడా క్లారిటీతో ఉన్నారు. కాబట్టి గులాబీ పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టిన, ఎన్ని కుట్రలు చేసిన ప్రజలు మాత్రం ఈటల వైపే ఎక్కువ మొగ్గు చూపేలా ఉన్నారు.