గతంలో కరువు.. నేడు అన్నపూర్ణగా తెలంగాణ- హరీష్ రావు

హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు బీజేపీపై ఫైర్ అయ్యారు. గతంలో కరువుతో అల్లాడే తెలంగాణ టీఆర్ఎప్ హయాంలో నేడు దేశానికే అన్నపూర్ణగా మారిందని హరీష్ రావు అన్నారు. గ్యాస్, పెట్రోల్, డిజిల్ ధరలు పెంచినందుకా బీజేపీకి ఓటేయాలా..? అని ప్రశ్నించారు. బీజేపీ హయాంలో డిజిల్ రేట్లు సెంచరీని దాటాయాని అన్నారు. 

వ్యవసాయ బావులకు మీటర్ల పెట్టాలని బీజేపీ ప్రభుత్వం చెబుతున్నా.. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు రైతులకు ఏ ఇబ్బంది కలుగకుండా చూస్తానిని మీటర్లు పెట్టేది లేదని అన్నవ్యక్తి కేసీఆర్ అని హరీష్ రావు అన్నారు. ఈటెల కేసీఆర్ కు మానవత్వం లేదని అంటున్నారని.. సంక్షేమ ఫలాలు అందుకుంటున్న ప్రజలకు తెలుసు కేసీఆర్ మానవత్వం గురించి అని విమర్శించారు. కరోనా సంక్షోభ సమయంలో అందరి జీతాలు ఆపినా రైతులకు రైతుబంధు ఆపని సర్కారు మాదని హరీష్ రావు అన్నారు.