ప్రపంచంలో ఎప్పుడూ రాని విపత్తుగా కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. ప్రపంచంలో అభివృద్ధి మరియు అగ్రదేశాలు అని చెప్పుకునే వాటిని హడలెత్తిస్తోంది. పేదవాడు ధనికుడు ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఎంపీ అని తేడా లేకుండా అందరూ సమానమే అన్నట్టుగా మనిషిని పిట్టల్లా కూల్చేస్తోంది. దీంతో మందులేని ఈ వైరస్ కి నివారణ ఒక్కటే మార్గం అని కరోనా వైరస్ ని కట్టడి చేయటం కోసం 21 రోజులపాటు లాక్ డౌన్ విధించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా లాక్ డౌన్ చాలా పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఏడాది క్రితం కరోనా వైరస్ వచ్చి ఉంటే ఏం జరిగి ఉండేది అన్న పరిస్థితి ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చలు జరుగుతున్నాయి. కచ్చితంగా ఏడాది క్రితం వైరస్ వచ్చి ఉంటే ఎన్నికలు వాయిదా పడేవి అని ఆ టైంలో వైయస్ జగన్ హవా తగ్గేది అని…అలా ఎన్నికలు వెనక్కి తగ్గక జగన్ మానియా పూర్తిగా తగ్గిపోయాక మళ్లీ ఎన్నికలు నిర్వహించి టీడీపీ అధికారంలోకి వచ్చేది అంటూ కొంతమంది నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
అంతేకాకుండా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య తెలంగాణ రాష్ట్రం తో పోలిస్తే చాలా తక్కువగా ఉందని..పొరపాటున తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువ ఉంటే…ఈపాటికి జగన్ ని టీడీపీ మీడియా ఒక ఆట ఆడుకునేది అని రాజీనామా చేయాలని, జగన్ అసమర్థుడని అంటూ కథనాలు ప్రసారం చేస్తోంది మరి కొంతమంది నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోపక్క తెలుగుదేశం మద్దతుదారులు కూడా నిజంగా ఈ వైరస్ ఏడాది క్రితం వచ్చి ఉంటే…వైరస్ ద్వారా చనిపోయిన కుటుంబాలను ఆదరించడానికి ఓదార్పు యాత్రతో వైయస్ జగన్ ఓట్లు అడిగేవాళ్లు అంటూ వ్యాఖ్యానించారు.