మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే లెక్క మారిపోద్ది…!

-

అవును మున్సిపల్ ఎన్నికల్లో తెరాస గెలిస్తే లెక్క మారిపోతుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీకి దిమ్మ తిరిగిపోయే అవకాశం ఉంటుంది. ఎన్నికల్లో అభ్యర్ధులను కూడా నిలబెట్టలేక ఇబ్బంది పడుతున్న కమల దళం, కెసిఆర్ ని ఇబ్బంది పెడతాం, కాషాయ జెండా ఎగరేస్తామని చెప్పాడ౦ ఆశ్చర్యమే. రాజకీయంగా తెరాస పార్టీని ఎదుర్కోవడం అంత తేలిక కాదని ఇంకా బిజెపి నేతలకు అర్ధం కాలేదు.

ఇప్పుడు కెసిఆర్ మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం విపక్షాలకు చుక్కలు చూపిస్తున్నారు. ఆయన్ను తక్కువ అంచనా వేసిన వారికి, మంత్రులకు ఇచ్చిన బాధ్యతలు చూసిన తర్వాత సినిమా ఏ విధంగా ఉంటుందో అర్ధమైపోయింది. రాజకీయంగా కెసిఆర్ ఏ విధంగా ముందుకి వెళ్తున్నారో స్పష్టత వచ్చింది. ఈ ఎన్నికల్లో తెరాస విజయం సాధిస్తే మాత్రం మారే లెక్కలు చాలానే ఉన్నాయని అంటున్నారు. తెరాస విజయం సాధిస్తే, బిజెపి దారులు మూసుకుపోయే అవకాశాలు ఉన్నాయి.

ఆర్ ఎస్ ఎస్ అడుగు పెట్టాలని చూసింది. ఈ ఎన్నికలు క్షేత్ర స్థాయి నుంచి జరుగుతాయి కాబట్టి, బిజెపికి తెరాస బలం ఏంటి అనేది స్పష్టంగా అర్ధమైపోతుంది. ఎన్నార్సి, కాబ్ చట్టాలు తెలంగాణాలో బిజెపి దారులు మూసాయి. వాటి విషయంలో కెసిఆర్ చాలా స్పష్టంగా ఉన్నారు. బిజెపికి అంత సినిమా లేదనే విషయం ప్రజలకు కెసిఆర్ పరోక్షంగా చెప్పేశారు. అందుకే తెరాస విజయం సాధిస్తే ఒక్క కాంగ్రెస్ కే కాదు, బిజెపి కి కూడా సినిమా క్లియర్ గా అర్ధమవుతుంది. మోడిషాలు కెసిఆర్ తో స్నేహం చేయడం మినహా దూకుడుగా వెళ్ళే అవకాశాలు ఏ మాత్రం ఉండవు.

Read more RELATED
Recommended to you

Latest news