అద్భుతః : అమెరికా కంటే మనమే కరోనా ని బాగా డీల్ చేస్తున్నాం..!!

-

కరోనా వైరస్ కట్టడి చేయడంలో ప్రపంచ దేశాలలో అన్ని దేశాలు తల పట్టుకుని ఉండే భారత్ మాత్రం లాక్ డౌన్ ప్రకటించి సేఫ్ జోన్ లోకి వెళ్ళింది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా తెలియజేసింది. కరోనా వైరస్ కట్టడి చేయడంలో భారత్ ప్రజలు కలసికట్టుగా పోరాడి తున్నారని మంచి ఐకమత్యం ఉందని ఐక్యరాజ్యసమితి అధికారి ఒకరు పొగడ్తల వర్షం కురిపించారు. ఇదిలా ఉండగా తాజాగా ప్రధాని మోడీ ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించారు. ప్రజలు ఎవరూ కూడా ఇల్లు దాటి బయటకు రాకూడదు అని ఒక ప్రధానిగా కాకుండా మీ ఇంటిలో కుటుంబ సభ్యుడిగా తెలియజేస్తున్నాను అంటూ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.Image result for modi trumpఅయితే వైరస్ ఈ విధంగా కొద్దిగా ఇండియాలో ఎక్కువగా ప్రభావం చూడటానికి కారణం రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించినా, కొందరు ప్రజలు లెక్క చేయకపోవడం, అదేవిధంగా విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు, తగిన జాగ్రత్తలు పాటించకపోవడం ఇలాంటి పరిస్థితి దాపురించిందని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. ఈ 21 రోజులు ప్రజలు ఇంటికి పరిమితం అయితే భవిష్యత్తు చేయగలమని దయచేసి ‘చేతులు జోడించి చెబుతున్నా.. ఈ రోజు అర్థరాత్రి నుంచి మీ ఇంటి చుట్టూ లక్ష్మణ రేఖ గీసుకోండి.. అందులోంచి బయటకు రావొద్దు..’ అంటూ మోడీ పేర్కొన్నారు.

 

ఇదిలా ఉండగా అగ్రరాజ్యం అమెరికా కంటే మనమే కరోనా ని బాగా డీల్ చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వార్తలు ప్రసారం చేస్తోంది. వైరస్ ప్రభావం చాలా ప్రమాదకరంగా ఉన్నా కానీ అమెరికాలో ఇంకా లాక్ డౌన్ లేదు .. అరవై వేల కేసు ఉన్నాయి. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు భారత్ అద్భుతః అంటూ కామెంట్ చేస్తూ స్టేట్ హోమ్ అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news