ఇండియా వర్సెస్ ఎన్డీయే..అవిశ్వాసం..మోదీ కన్నీరు.!

-

దేశ రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్నాయి. ఓ వైపు ప్రతిపక్షాలు అన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఇటు ప్రతిపక్షాలకు ధీటుగా బి‌జే‌పి..తమ మిత్రపక్షాలని కలుపుకుని ఎన్డీయేగా బలపడుతుంది. మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తుంది. బి‌జే‌పికి చెక్ పెట్టి అధికారం దక్కించుకోవాలని విపక్షాలు చూస్తున్నాయి. ఇక బయటే కాదు వీరి రాజకీయం..పార్లమెంట్ లో కూడా నడుస్తుంది. మణిపూర్ లో మహిళలని వివస్త్రలుగా చేసి అత్యాచారం చేసిన ఘటనలపై..రాష్ట్రంలో నిరసనలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఊహించని విధంగా అల్లర్లు చోటు చేసుకున్నాయి.

ఈ అమానవీయ ఘటనలపై బి‌జే‌పి నిమ్మకు నీరెత్తినట్లు ఉందని, దీనిపై పార్లమెంట్ లో చర్చ జరగాలని, మణిపూర్ అల్లర్లపై మోదీ స్పందించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే   మొత్తం 26 పార్టీలతో కూడిన ప్రతిపక్ష పార్టీల ఇండియా కూటమి ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించాయి.

మణిపూర్ హింసపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో ప్రసంగించాలనే డిమాండ్ లక్ష్యంగా ప్రతిపక్షాలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మణిపూర్ హింసపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అటు బీజేపీ పార్లమెంటరీ సమావేశం జరగగా, ఈ సమావేశంలో మోదీ ప్రతిపక్షాల తీరుపై కన్నీటి పర్యంతమయ్యారు. ప్రతిపక్షాల తీరుపై మోదీ తీవ్ర ఆవేదన చెందుతున్నారు అని బీజేపీ వర్గాలు ప్రతిపక్షాల వైఖరిపై మండిపడుతున్నాయి.

PM Modi Tears

అలాగే  ‘ఇండియా’ అని పేరు పెట్టుకొన్నంత మాత్రాన… ప్రతిపక్షాల తీరు మారుతుందా..? అని ప్రశ్నించిన ఆయన.. గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదీన్ వంటి వాటి పేర్లలో కూడా ఇండియా ఉందని, ఆఖరికి పీఎఫ్ఐ వంటి ఉగ్ర సంస్థల పేరులో కూడా ఇండియా ఉందన్నారు. ఇక మణిపూర్ హింస నేపథ్యంలో విపక్షాల ఆందోళన, పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ పార్లమెంటరీ పార్టీ చర్చించింది. మొత్తానికి మణిపూర్ ఘటన దేశంలో ప్రకంపనలు సృష్టిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news