అప్పుడు ఈరన్న-ఇప్పుడు వనమా..ఎన్నికల ముందే.!

-

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై వేటు పడింది. ఆయన ఎన్నికల్లో తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించారని పిటిషన్ దాఖలు కాగా, దాన్ని విచారించిన హైకోర్టు..ఆయన ఎమ్మెల్యే పదవిపై వేటు వేసింది. మరో ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకూడదని తీర్పు ఇచ్చింది.  కొత్తగూడెం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చింది. దీంతో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును కోర్టు ఎమ్మెల్యేగా ప్రకటించింది.

అయితే గత ఎన్నికల్లో వనమా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి కొత్తగూడెంలో గెలిచారు. అప్పుడు బి‌ఆర్‌ఎస్ నుంచి జలగం వెంకటరావు పోటీ చేసి ఓడిపోయారు. ఇక వనమా తప్పుడు అఫిడవిట్ సమర్పించి ఎన్నికల్లో పోటీ చేశారని జలగం కోర్టుకు వెళ్లారు. ఇక తర్వాత వనమా బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు. ఈ లోపు కేసు నడుస్తూనే ఉంది. అటు వనమా తనయుడు రాఘవపై ఎలాంటి ఆరోపణలు వచ్చాయో తెలిసిందే. ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో రాఘవ జైలుకు కూడా వెళ్ళొచ్చారు. ఈ అంశం వనమాకు మైనస్ అయింది.

TDP Former MLA Eranna

పైగా నెక్స్ట్ ఎన్నికల్లో ఈయనకు సీటు రాదని తేలింది. జలగంకు సీటు దక్కే ఛాన్స్ ఉందని ప్రచారం వచ్చింది. ఈ లోపే వనమాపై వేటు పడింది. జలగం ఎమ్మెల్యే అయ్యారు. కానీ ఎన్నికలకు ఇంకా మూడు నెలలే ఉంది. దీంతో ఆయన పదవి మూడు నెలలే. నెక్స్ట్ కొత్తగూడెం సీటు జలగం దక్కించుకునే ఛాన్స్ ఉంది.

ఇదిలా ఉంటే కరెక్ట్ గా 2019 ఎన్నికల ముందు ఏపీలో అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యేగా అప్పుడు టి‌డి‌పి నుంచి ఈరన్న ఉన్నారు. ఈయన తప్పుడు అఫిడవిట్ సమర్పించి ఎన్నికయ్యారని వైసీపీ నేత తిప్పేస్వామి కోర్టుకు వెళ్లారు. దీంతో కోర్టు కేసుపై తీర్పు ఇస్తూ..ఈరన్నపై వేటు వేసింది. అప్పుడు తిప్పేస్వామి ఎమ్మెల్యే అయ్యారు. ఇక 2019లో కూడా తిప్పేస్వామి వైసీపీ నుంచి గెలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news