ఎక్కడ సమస్య వస్తే.. అక్కడ దానికి తగిన పరిష్కారం వెతకడం, ఆ సమస్యను పరిష్కరించడం అనేది నాయకుల ప్రధాన లక్ష్యం. ఈ క్రమంలో ప్రజలను సమీకరించడం, నిజాలు నిజాలను వారి ముందు పెట్టడం అనేది ప్రధానంగా వ్యవహరించాలని కీలక అంశం. అయితే, దీనికి భిన్నంగా చంద్రబాబు ఏసమస్య వచ్చినా.. దానికి పరిష్కారంగా కులం కార్డును వినియోగిస్తున్నారనే విమర్శలు ఇటీవల కాలంలో ఎక్కువవుతున్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు.. జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జగన్‌కు పాలన చేతకాదని ఆయన చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై చులకనభావం ఏర్పడేలా వ్యవహరిస్తున్నారు.
ఇక, ఎప్పడికప్పుడు కులం కార్డును వినియోగిస్తున్నారు. రాజధాని అంశాన్ని తీసుకుంటే.. ప్రభుత్వ వాదన ఒకరకంగా ఉంటే.. దానికి కౌంటర్‌గా ఉండాల్సిన చంద్రబాబు వాదన దారి తప్పింది. ఒక సామాజిక వర్గం బాగు పడడం కోసం.. అక్కడ చంద్రబాబు రాజధానిని ఏర్పాటు చేశారని అధికార పార్టీ నాయకులు అంటే.. దీనికి సరైన విధంగా రుజువులు సాక్షాలు చూపించి ఎదుర్కొనాల్సిన చంద్రబాబు ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీల ను వినియోగించుకున్నారు. రాజధాని ప్రాంతంలో తాడికొండ ఎస్సీ నియోజకవర్గం ఉందని ఇక్కడ వారంతా ఎస్సీలేనని ఇప్పుడు ఇక్కడ రాజధాని లేకపోతే.. జగన్ వారికి మోసం చేసినట్టేనని ఆయన కొత్తవాదన తెచ్చారు.
ఇక, గుంటూరులోని ఆత్మకూరులో తన పార్టీ నేతలపై వైసీపీ నాయకుడు దౌర్జన్యాలు చేసి ఇంటి నుంచి వెళ్లగొట్టారని ఆరోపించిన చంద్రబాబు తర్వాత కాలంలో దీనికి కూడా కులం కార్డును జోడించారు. వారంతా ఎస్సీలు, ఎస్టీలు కాబట్టి జగన్ ప్రభుత్వం ఇలా చేస్తోందన్నారు. ఇక, సీఆర్ డీఏ బిల్లు, మూడు రాజధానుల బిల్లు విషయంలో శాసన మండలిలో చైర్మన్ షరీఫ్ ఉదంతాన్ని కూడా మతం కార్డు జోడించి వాడుకున్నారు చంద్రబాబు.
ఆయన మైనార్టీ కాబట్టి జగన్ ప్రభుత్వం ఆయనపై దాడి చేయించేందుకు రెడీ అయిందని అన్నారు. అంతేకాదు, మైనార్టీ లంటే .. జగన్‌కు ఏమాత్రం గౌరవం లేదని ఆడిపోసుకున్నారు. ఇక, ఇప్పుడు మరోసారి అంశంపైనా ఇదే తరహా కులం కార్డును ప్రయోగించారు చంద్రబాబు. ఈ ఎస్ ఐ మందుల కుంభకోణం పదుల కోట్లలో ప్రజాధనం దోచుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, టెక్కలి టీడీపీ ఎమ్మెల్యే అచ్చన్నాయుడిపై అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు.
దీంతో వెంటనే ఈ విషయంపై స్పందించిన చంద్రబాబు .. అదిగో.. ఇప్పుడు బీసీలపై జగన్ ప్రభుత్వం దాడులు చేస్తోందని, బీసీలను అణిచివేయాలనే ఉద్దేశంతోనే అచ్చన్నపై కేసులు పెట్టేందుకురెడీ అయిందని పెద్ద ఎత్తున యాగీ కి సిద్ధమయ్యారు., అయితే, ఒక్క విషయం ఏంటంటే.. చంద్రబాబు చేస్తున్న ఈ కులం కార్డు రాజకీయాలను గమనిస్తున్నవారు నాన్నా పులి తరహాలో చంద్రబాబు చేస్తున్నారని నవ్విపోతున్నారు. ఒక్కసారి ఏదైనా కులం కార్డు వాడితే ..నమ్ముతారు.. ప్రతి విషయానికీ కులం కార్డును జోడించడం సబబుగా లేదని, ఆయన పెద్దరికంగా వ్యవహరించడం లేదని అంటున్నారు.