కమలంలో ‘సీఎం’ ఎవరు? బండి క్లారిటీ ఇచ్చినట్లేనా?

-

తెలంగాణ బీజేపీకి సీఎం అభ్యర్ధి ఎవరు? నెక్స్ట్ ఎన్నికల్లో ఎవరిని బేస్ చేసుకుని బీజేపీ ఎన్నికల బరిలో దిగుతుంది? అంటే ఇప్పుడే ఈ విషయంపై క్లారిటీ వచ్చేలా లేదు. ఎన్నికల ముందు బీజేపీ సీఎం అభ్యర్ధిని డిసైడ్ చేసుకుని ఎన్నికలకు వెళ్ళడం కష్టమని తెలుస్తోంది. అయితే సీఎం అభ్యర్ధిని డిసైడ్ చేయకపోవడం వల్ల బీజేపీకి కాస్త నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో ఎన్నిక వేరు…తెలంగాణలో ఎన్నిక వేరు. ఇక్కడ బీజేపీ ఒక ప్రాంతీయ పార్టీతో తలపడుతుంది. కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్‌తో బీజేపీ పోటీ పడాలి. కేసీఆర్ ఎంత బలమైన నాయకుడో చెప్పాల్సిన పని లేదు. ఆయనకు చెక్ పెట్టాలంటే బీజేపీలో అంతే బలమైన నాయకుడు ఉండాలి. పార్టీ పరంగా ముందుకెళితే…కేసీఆర్‌ని ఢీకొట్టడం కష్టం. జాతీయ స్థాయిలో మోడీ నాయకత్వాన్ని ముందు పెట్టుకుని బీజేపీ ఎలా ఎన్నికలకు వెళుతుందో అలాగే తెలంగాణలో కూడా ఒక నాయకుడుని ముందుపెట్టుకుని ఎన్నికలకు వెళితే మంచి ఫలితం వస్తుంది. లేకపోతే బీజేపీ బోల్తా కొడుతుంది.

అయితే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్…ఎవరు సీఎం అయినా అలా చేస్తాం..ఇలా చేస్తామని చెబుతున్నారు. మొదటి సంతకం ఉచిత విద్య, వైద్యం ఫైలు మీద పెట్టిస్తామని అంటున్నారు. ఆ బాధ్యత తనదే అంటున్నారు. ఈ విషయంలో బండి కాస్త క్లారిటీ ఇస్తున్నట్లే కనిపిస్తోంది. ఆయన మాటల బట్టి చూస్తే బండి కూడా సీఎం రేసులో ఉన్నారని తెలుస్తోంది.

అయితే సీఎం అభ్యర్ధి అనే అంశం ఎన్నికలకు ముందే ఫిక్స్ అయిపోతే బాగుంటుంది. అలా కాకుండా సీఎం అభ్యర్ధి లేకుండా ఎన్నికల బరిలో దిగితే ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే సీఎం అభ్యర్ధి రేసులో కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ లాంటి వారు కూడా ఉన్న విషయం తెలిసిందే. మరి సీఎం ఎవరు అనే విషయం త్వరగా క్లారిటీ ఇస్తే బీజేపీకే బెనిఫిట్.

Read more RELATED
Recommended to you

Latest news