మధిరలో భట్టిని నిలువరించేది ఎవరు..కారుకు మళ్ళీ బ్రేకులేనా?

-

ఉమ్మడి ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం..ఏపీకి బోర్డర్ ఉన్న ఈ స్థానంలో రెండు రాష్ట్రాల ప్రజలు ఉంటారు. ఇటు తెలంగాణకు చెందినవారు..అటు ఆంధ్రా నుంచి ఇక్కడ సెటిల్ అయిన వారు ఉన్నారు. ఇలా రెండు రాష్ట్రాల ఓటర్లతో మిక్స్ అయిన మధిరలో ఇంతవరకు అధికార బి‌ఆర్‌ఎస్ గెలవలేదు. గతంలో ఈ స్థానంలో కాంగ్రెస్, సి‌పి‌ఐలు సత్తా చాటాయి. ఒక్క 1999 ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం గెలిచింది. ఇక ఇది ఎస్సీ రిజర్వడ్ అయ్యాక ఇక్కడ వరుసపెట్టి కాంగ్రెస్ నుంచి భట్టి విక్రమార్క గెలుస్తూ వస్తున్నారు.

2009, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలిచారు..ఇలా వరుసగా గెలుస్తున్న భట్టికి ఇప్పటికీ మధిరలో మంచి పట్టు ఉంది..ఇక్కడ ఆయనకు మరోసారి గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా సర్వేలు చెబుతున్నాయి. అదే సమయంలో ఇక్కడ తొలి విజయం సాధించాలని బి‌ఆర్‌ఎస్ ప్రయత్నిస్తుంది. కానీ బి‌ఆర్‌ఎస్ ప్రయత్నాలు నిజమయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే కార్ పార్టీలో ఆధిపత్య పోరు ఉంది. కమల్ రాజు, బొమ్మెర రామ్మూర్తిల మధ్య రచ్చ నడుస్తోంది.

 

సీటు కోసం ఇరువురు నేతలు పోటీ పడుతున్నారు. ఒకరికి సీటు వస్తే మరొకరు సహకరించే పరిస్తితి లేదు. పైగా ఇక్కడ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గం ఉంది. ఆయన బి‌ఆర్ఎస్ వీడటానికి రెడీ అయ్యారు. అది కూడా బి‌ఆర్‌ఎస్ పార్టీకి నష్తమే. ఇక్కడ టీడీపీ, సి‌పి‌ఐలకు బలం ఉంది. ఆ రెండు పార్టీలు బరిలో ఉంటే ఎవరు ఓట్లు చీల్చి ఎవరికి డ్యామేజ్ చేస్తాయో చెప్పలేని పరిస్తితి.

ఇక్కడ బి‌జే‌పి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఒకవేళ పొంగులేటి బి‌జే‌పిలో చేరితే..మధిరలో బి‌జే‌పికి కాస్త బలం వస్తుంది..కానీ గెలిచే బలం డౌటే. మొత్తానికి చూసుకుంటే పరిస్తితులు భట్టికే అనుకూలంగా ఉన్నాయి. మరి ఓట్ల చీలిక, బి‌ఆర్‌ఎస్ పోరు..చివరికి ఎవరికి లాభం చేకూరుస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news