ఇక రేవంత్‌కు కష్టమేనా?

-

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పరిస్తితి మరీ ఘోరంగా తయారైన విషయం తెలిసిందే. తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినా సరే ప్రజలు ఆదరించలేదు. మొదటసారి జరిగిన ఎన్నికల్లో దాదాపు ఎలాంటి ఫలితాలు వచ్చాయో రెండోసారి ఎన్నికలు జరిగినప్పుడు అలాంటి ఫలితాలే వచ్చాయి. పైగా కేసీఆర్.. అసలు కాంగ్రెస్‌ని టార్గెట్ చేసి ఎలాంటి రాజకీయం చేశారో చెప్పాల్సిన పని లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలని, నాయకులని టీఆర్ఎస్‌లోకి తీసుకొచ్చేశారు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందనే విధంగా పరిస్తితి వచ్చింది.

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి | Revanth Reddy

ఇలాంటి సమయంలోనే టి‌పి‌సి‌సి పగ్గాలు రేవంత్ రెడ్డికి అప్పగించారు. ఇక్కడ నుంచే కాంగ్రెస్‌కు కాస్త ఊపిరి అందడం మొదలైంది. రేవంత్ దూకుడు వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ రేసులోకి వచ్చింది. టీఆర్ఎస్‌కు ధీటుగా కాంగ్రెస్ మాత్రమే నిలబడుతుందనే పరిస్తితి వచ్చింది. అలాగే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న రేవంత్‌కు ప్రజల మద్ధతు కూడా పెరిగింది. దీంతో టీఆర్ఎస్‌కు పోటీ ఇచ్చేది కాంగ్రెస్ మాత్రమే అనే పరిస్తితి వచ్చింది.

కానీ హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత పరిస్తితి మారిపోయింది. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గెలవడం, ఆ ఎన్నికలో కాంగ్రెస్‌కు 3 వేల ఓట్లు మాత్రమే రావడంతో అంతా తారుమారైంది. మామూలుగా హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ఓడిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ఈ రేంజ్‌లో ఓడిపోతుందని ఎవరు అనుకోలేదు. ఇక దీన్ని అడ్డం పెట్టుకునే కాంగ్రెస్‌లో కొందరు సీనియర్లు రేవంత్‌ని కిందకు లాగే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే హుజూరాబాద్ గురించి ఢిల్లీలో పెద్ద పంచాయితీ నడిచింది.

అయితే పంచాయితీ జరిగిన పెద్దగా ఫలితం లేదనే చెప్పాలి. పైగా రేవంత్ దూకుడుకు కళ్ళెం వేసినట్లు అయింది. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడు ఉంది. పైగా బండిని కేసీఆర్ డైరక్ట్‌గా టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఇక్కడ కాంగ్రెస్ సైడ్ క్యారెక్టర్‌కు పరిమితమైనట్లు పరిస్తితి వచ్చింది. ఇకనుంచి రేవంత్ దూకుడుగా ఉన్నా సరే కాంగ్రెస్ బాగుపడేలా లేదు. ఏదేమైనా సొంత పార్టీ నేతల వల్లే రేవంత్ దూకుడు తగ్గడం, కాంగ్రెస్‌కు నష్టం జరగింది.

Read more RELATED
Recommended to you

Latest news