ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడుగా రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. నెల రోజుల నుంచి ఆయన ప్రజల్లోనే తిరుగుతున్నారు..ఓ వైపు జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేస్తూ విమర్శిస్తూనే..మరోవైపు జనసేనని బలోపేతం చేసే కార్యక్రమాల్లో ఉన్నారు. అయితే అంతకముందు వరకు ఆయన సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటూ అప్పుడప్పుడు మాత్రమే రాజకీయాల్లో కనిపించారు. దీని వల్ల జనసేన బలం పెరగలేదు.
కానీ ఇప్పుడు ఆయన దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. వైసీపీతో ఢీ అంటే ఢీ అనేలా ఫైట్ చేస్తున్నారు. దీని వల్ల టిడిపి సైడ్ అయ్యి..వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్లు పోరు నడుస్తుంది. అలాగే జనసేనలోకి వలసలు కొనసాగుతున్నాయి. అలాగే బలమైన స్థానాలపై పవన్ ఫోకస్ పెట్టి ముందుకెళుతున్నారు. ఇక దీని వల్ల పవన్ గ్రాఫ్ పెరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే పవన్ గ్రాఫ్ పెరగడమే జగన్‌కు కూడా కావాలని విశ్లేషకులు అంటున్నారు.
పవన్ గ్రాఫ్ ఎంత పెరిగితే..అంత ఎక్కువగా ఓట్లు చీలిపోయి వైసీపీకి లాభం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అంటే టిడిపి-జనసేన విడిగా పోటీ చేస్తే ఓట్లు చీలి వైసీపీకి ప్లస్ అవుతుందనే కాన్సెప్ట్. ఒకవేళ పొత్తు ఉన్నా సరే తమ గ్రాఫ్ పెరిగిందని చెప్పి పవన్..ఎక్కువ సీట్లు తీసుకుంటారు..అప్పుడు టిడిపి ఒప్పుకోదు. విభేదాలు వచ్చి పొత్తు చెడిపోతుంది. అప్పుడైనా వైసీపీకే ప్లస్సే. అయినా సరే పొత్తు పెట్టుకున్నా. జనసేన ఎక్కువ సీట్లు తీసుకుంటే..ఆ సీట్లలో టిడిపి ఓట్లు జనసేనకు బదిలీ కావు. దాని వల్ల మళ్ళీ వైసీపీకే లాభం.
అందుకే పవన్ నే ఎక్కువ టార్గెట్ చేసి ఆయన్ని హైలైట్ చేసే విషయంలో వైసీపీ దూకుడుగా ఉందని అంటున్నారు. మరి చూడాలి పవన్ గ్రాఫ్‌ని పెంచడం వల్ల వైసీపీకి లాభమో..నష్టమో.