జగనే గెలుపు గుర్రం..వైసీపీకి 100 పైనే.!

-

వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలని ఎంపిక విషయంలో టి‌డి‌పి అధినేత చంద్రబాబు బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఒకసారి అన్నీ నియోజకవర్గాల నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహించి ఆయా స్థానాల్లో పరిస్తితులని తెలుసుకున్నారు. మరొకసారి ఆయన నియోజకవర్గాల వారీగా నేతలతో మాట్లాడుతున్నారు. అలాగే ఖాళీగా ఉన్న స్థానాలకు ఇంచార్జ్‌లని నియమిస్తున్నారు. ఈ సారి ఎలాగైనా గెలవాలని చెప్పి బలమైన అభ్యర్ధులని ఫిక్స్ చేయాలని చూస్తున్నారు.

మరి బాబు అలా చేస్తున్నప్పుడు…జగన్ కూడా గెలుపు గుర్రాలని రెడీ చేసుకోవాలి. అయితే జగన్‌కు గెలుపు గుర్రాలు అంటే..కొందరే ఉంటారు..కొన్ని స్థానాల్లోనే సొంత బలంతో గెలిచే ఎమ్మెల్యేలు ఉంటారు. కానీ మెజారిటీ స్థానాల్లో వైసీపీకి గెలుపు గుర్రం అంటే జగనే. ఆయన ఇమేజ్ తోనే వైసీపీ ఎమ్మెల్యేలు గెలవాలి. గత ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు వచ్చాయంటే దానికి కారణం జగన్ ఇమేజ్ మాత్రమే. ఏదో కొంతమంది మాత్రమే పార్టీ బలంతో పాటు తమ సొంత బలంతో గెలిచారు. అయితే ఈసారి కొందరు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉంది. ఇక వారిని జగన్ పక్కన పెట్టేస్తారని తెలుస్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు.

ఇక ఏ అభ్యర్ధిని పెట్టిన వైసీపీకి గెలిచే అవకాశం ఉంటుందంటే అది కేవలం జగన్ ఇమేజ్ వల్లనే చెప్పవచ్చు. అయితే జగన్‌కు ఉన్నట్లు బాబుకు ఉండదు. ఏపీలో బాబుని చూసి ఓట్లు వేసే వారు తక్కువే. టి‌డి‌పి అనేది ఒక బ్రాండ్ గా ఉండటం..ఎన్నో ఏళ్ల నుంచి ఆ పార్టీలోనే ఉన్న కార్యకర్తల బలంతో గెలవాలి. అలాగే ఆ పార్టీలో బలమైన నాయకులు ఉన్నారు. వారితోనే టి‌డి‌పి విజయం అందుకోవాలి.

అదే వైసీపీ మాత్రం జగన్ ఇమేజ్ తో ముందుకెళ్లాలి. ఇప్పుడు ఏపీలో టి‌డి‌పి బలం కంటే జగన్ ఇమేజ్ ఎక్కువగా ఉంది కాబట్టి…మళ్ళీ జగన్ ఇమేజ్ తోనే వైసీపీ గెలుపు సాధ్యం..ఇప్పుడున్న పరిస్తితుల్లో వైసీపీ 100కి పైనే స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news