విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో సరైన నిధులు కేటాయించకపోవడం జరిగింది. దీంతో చాలామంది కేంద్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్రం పట్ల బడ్జెట్ విషయంలో వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి జగన్ మాత్రమే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ విషయంలో విధించిన నిధుల విషయంలో ఇప్పటిదాకా నోరు మెదపకపోవడం పట్ల చాలామంది రాజకీయ నేతలు విమర్శిస్తున్నారు.
పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని చూసుకొని జగన్ చాలా నేర్చుకోవాలని సూచనలు ఇస్తున్నారు. జగన్ చేయలేనిది కెసిఆర్ చేసి చూపించడం జరిగింది అని బడ్జెట్ ప్రతిపాదనలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉండటంతో పాటు కేంద్ర పన్నుల్లో తెలంగాణకు రావాల్సిన వాటా నిష్పత్తిని తగ్గించడం విషయాలపట్ల కేంద్రాన్ని కెసిఆర్ ప్రశ్నిస్తూ కేంద్రాన్ని వణికించారు అంటూ మండిపడుతున్నారు.
ధనిక రాష్ట్రమైన తెలంగాణకి ఆ విధంగా కేంద్రం బడ్జెట్లో అన్యాయం చేస్తే కెసిఆర్ స్పందిస్తే…విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి భారీ ప్రాజెక్టులు సరైన నిధులు కేటాయించకపోవడం పట్ల జగన్ ఎందుకు నోరు మెదపడం లేదని కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు విమర్శిస్తున్నారు.