ముసలి పులి బాబు..జగన్ కొత్త కథ.!

-

ఏదొక పథకం పేరుతో బటన్ నొక్కి డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని..బహిరంగ సభలు పెట్టి జగన్..చంద్రబాబు టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. తాను అందరికీ మంచి చేస్తున్నానని, చంద్రబాబు, పవన్ తోడేళ్ళ గుంపు అని, ఇక చంద్రబాబుని పదే పదే ముసలాయన అంటూ జగన్ విమర్శలు చేస్తున్నారు. అలాగే తాను ఒంటరిగా పోరాడుతున్నానని ప్రజల్లో పదే పదే సానుభూతి పొందేలా జగన్ ముందుకెళుతున్నారు.

ఇక తాజాగా జగన్..జగనన్న వసతి దీవెన కార్యక్రమలో బటన్ నోక్కే కార్యక్రమాన్ని శింగనమల నియోజకవర్గంలో పెట్టారు. ఇక కాసేపు వసతి దీవెన గురించి మాట్లాడారు…ఇక ఇది గత ప్రభుత్వాల్లో స్కాలర్‌షిప్స్ పేరిట పథకం వచ్చేది. ఇప్పుడు జగన్ పేరు పెట్టుకుని ఇస్తున్నారు. ఇప్పుడు దీనికి బటన్ నోక్కారు. ఆ తర్వాత యథావిధిగా బాబుపై విమర్శలు చేశారు. తోడేళ్ళ గుంపు తనపై దాడి చేస్తుందని, ప్రజలే అండగా ఉండాలని అన్నారు.

ఇక తాజాగా బాబు..ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై జగన్ స్పందించారు. ఇది నరమాంసం తినే పులి.. ఇప్పుడు ముసలిదైపోయింని, పరిగెత్తలేక, నడవలేక, 4 తోడేళ్ల లాంటి నక్కలను తోడు తెచ్చుకుంటుందని,  ఈ పులి అడవిలో 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెబుతూ.. నాలుగు నక్కలని తోడేసుకుని వాళ్లతో మనుషుల్ని చంపడం ఎలా అని ప్లాన్ చేస్తుందని,  ఇప్పుడు తాను ఎవరిని చంపి తినడం లేదని నమ్మిస్తుందని, చంద్రబాబు అనే పులి మోసం గురించి తెలిసిన వారు ఎవరు ఆయన వెంట రారని జగన్ విమర్శించారు.

ఇక యథావిధిగా వెన్నుపోటు పొడిచేవారిని, మాయమాటలు చెప్పే వారిని నమవద్దని జగన్ కోరారు. మరి ఎవరు చివరికి ప్రజలు ఎవరిని నమ్ముతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news