జగన్ అదిరే స్ట్రాటజీ..ఆ జిల్లాలతోనే మ్యాజిక్ ఫిగర్.!

-

మరో 30 ఏళ్ల పాటు సీఎంగా ఉండాలనేది జగన్ కల.. ఆ కలని సాకారం చేసుకునే దిశగానే ఆయన రాజకీయ పయనం సాగుతుంది. అయితే ఆ 30 ఏళ్ల కలని నెరవేర్చుకోవాలంటే ముందు..వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారం సాధించడం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఏదో అధికారంలో ఉన్నాం కదా..సులువుగా మళ్ళీ గెలిచేస్తామనుకుంటే అది పొరపాటే.

ఈ సారి గెలుపు అనేది అంత ఈజీ కాదు. పైగా నెక్స్ట్ గాని అధికారంలోకి రాకుండా..బాగా కసితో ఉన్న టి‌డి‌పి అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో కూడా ఊహించుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్నంత మాత్రాన లైట్ తీసుకోకుండా..నెక్స్ట్ మళ్ళీ గెలిచే సత్తా చాటే దిశగానే జగన్ ముందుకెళుతున్నారు. అయితే గత ఎన్నికల మాదిరిగా వన్ సైడ్ ఫలితాలు మాత్రం రావు. ఈ సారి గెలవడానికి వైసీపీ కష్టపడాలి. ఏదో వైసీపీ నేతలు మళ్ళీ తమదే అధికారం అని చెబుతున్నట్లుగా..సులువుగా అధికారం సొంతం చేసుకోవడం కష్టం.

ఈ సారి ప్రత్యర్ధులు బలంగా ఉన్నారు. పైగా టి‌డి‌పి, జనసేన కలిస్తే గెలవడానికే కష్టపడాలి. ఇది ముమ్మాటికి వాస్తవం. ఆ రెండు పార్టీలు కలిస్తే బలం పెరుగుతుంది. ఆ బలాన్ని నిలువరించాలి. పొత్తుని విఫలం చేయాలి.  ఇక తమకు పట్టున్న సీట్లని వదులుకోకుండా..టీడీపీ, జనసేన ప్రభావం ఉన్న సీట్లలో సైతం వ్యూహాలతో ముందుకెళ్లి గెలవాలి. ఇక వైసీపీకి కీలకమైన రాయలసీమ జిల్లాల్లోనే మెజారిటీ సీట్లు సాధించాలి. సీమలో 52 సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో 49 గెలిచారు. ఈ సారి 35-40 గెలుచుకున్న చాలు.

అటు ప్రకాశం-నెల్లూరులో కలిపి 22 సీట్లు ఉన్నాయి..ఆ జిల్లాల్లో 12-14 సీట్లు గెలిస్తే చాలు. ఇక టి‌డి‌పి కాస్త బలంగా ఉన్న కృష్ణా-గుంటూరు జిల్లాల్లో 33 సీట్లు ఉన్నాయి..ఈ జిల్లాల్లో 15 పైనే సీట్లు వస్తే చాలు. ఇక టి‌డి‌పి-జనసేన ప్రభావం భారీగా ఉండే ఉభయ గోదావరి జిల్లాల్లో 34 సీట్లు ఉన్నాయి..అందులో 10 సీట్లు వస్తే వైసీపీ సక్సెస్ అయినట్లే. ఇక ఉత్తరాంధ్రలో మొత్తం 34 సీట్లు ఉన్నాయి..ఇక్కడ 15-20 సీట్లు టార్గెట్ పెట్టుకోవాలి. ఇలా వైసీపీ గెలుచుకుంటే మ్యాజిక్ ఫిగర్ 88 దాటేసి..100 సీట్లు వరకు గెలుచుకుని అధికారంలోకి రావచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news