దేశంలో ఎవరూ చేయని పని చేసిన జగన్ సర్కార్…!

-

కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ ఇప్పుడు కట్టడిలోనే ఉంది. ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం వైరస్ ని కట్టడి చేయడం అనేది పెద్ద విషయం కాదు. ఈ నేపధ్యంలోనే ఏపీ ప్రభుత్వం కాస్త కొత్తగా ఆలోచించి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని విధంగా నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్ లో ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద తిరుగుతున్నారు.

వాళ్ళను కట్టడి చెయ్యాలి అంటే ప్రభుత్వానికి పెద్ద తల నొప్పిగా మారింది. దీనితో ఒక కొత్త సాఫ్ట్ వేర్ ని ఏపీ ప్రభుత్వం రెడీ చేసింది. 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉండాలంటూ ప్రభుత్వం ఆదేశించినప్పటికీ దాన్ని పట్టించుకోకుండా బయట తిరగడంతో ‘కోవిడ్ అలర్టింగ్ ట్రాకింగ్ సిస్టమ్‌’ ని తయారు చేసింది… స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ. వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు…? ఎక్కడికి వెళ్తున్నారు…?

వాళ్ళు ఎక్కడ ఉన్నారు…? ఇలా ప్రతీ విషయాన్ని ఈ సాఫ్ట్ వేర్ ద్వారా ఏపీ ప్రభుత్వం ట్రాక్ చేయడానికి సిద్దమవుతుంది. 25 వేల మందికి సంబంధించిన అన్ని ఫోన్ నంబర్లు, డేటా వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఆ వివరాలను ఈ ట్రాకింగ్ సిస్టంలో పొందుపరిచారు. వారు అందరిని కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం ట్రాక్ చేయనుంది. వంద మీటర్ల పరిధిని దాటి వెళ్తే వెంటనే ఆ సమాచారం ఈ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా జిల్లా అధికారులకు వెళ్తుంది.

వెంటనే ఆ అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తారు. మొబైల్ నంబర్, ఇంటి అడ్రస్, వీధి, ల్యాండ్ మార్క్ ఇవన్నీ పోలీసులకు అందడంతో వారు వెళ్లి అతన్ని కట్టడి చేస్తారు. ఒకవేళ అతను మాట వినకపోతే మాత్రం అరెస్ట్ చేయడానికి కూడా వెనుకాడే అవకాశం లేదు. దీనిని తక్షణమే అందుబాటులోకి తీసుకు వచ్చి వెంటనే కరోనా వైరస్ ని కట్టడి చెయ్యాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news