ఏపీ షేకింగ్ న్యూస్ : అమరావతి పేరు మార్పు ?? కొత్త పేరు ఇదే !! 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ మొత్తం అమరావతి చుట్టూ తిరుగుతుంది. అమరావతి రాజధాని విషయంలో జగన్ తీసుకొన్ననిర్ణయం పట్ల చంద్రబాబు నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా అమరావతి ప్రాంతానికి చెందిన భూములు ఇచ్చిన వాళ్లు తీవ్రస్థాయిలో నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు.

మరోపక్క విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే ఏం చేయాలి అన్న దానిపై జగన్ సర్కార్ జీఎన్ రావు కమిటీ మరియు బోస్టన్ గ్రూప్ నివేదిక అదేవిధంగా హైపవర్ కమిటీ వేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో తాజాగా ఈ మూడు కమిటీల కు సంబంధించిన నివేదికలు జగన్ కి అందిన నేపథ్యంలో ఇంకా కొంత సమాచారం సేకరించవలసిన క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని షేకింగ్ చేసే న్యూస్ వినబడుతోంది.

అదేమిటంటే అమరావతికి పేరు మార్చాలన్న కొత్త వాదన తెరపైకి వచ్చినట్లు సమాచారం. చంద్రబాబు హయాంలో ఏవైతే రాజధాని పరిధిలో ఉన్న గ్రామాలకు ఉన్నవో వాటికీ అమరావతి అనే నామకరణం చేయడం జరిగింది. అయితే తాజాగా మాత్రం జగన్ సర్కార్ గతంలో ఏ ఊరికి ఏ పేరు ఉండేదో ఆ పేర్లు కంటిన్యూ చేయాలని తాజాగా అమరావతి అనే పేరుని ఒక చిన్న గ్రామం వరకు పరిమితం చేసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.