నెక్స్ట్ ఎన్నికల్లో గెలవడానికి జగన్ వేసే వ్యూహాలు ప్రత్యర్ధులకు అర్ధం కాకుండా ఉన్నాయి..అసలు జగన్ పని అయిపోయిందని, అబ్బో ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చేసిందని, ఇంకా జగన్ గెలవడం కష్టమని టిడిపి, టిడిపి మీడియా ప్రచారం చేస్తుంది..కానీ జగన్ సైలెంట్ గా తన వ్యూహాలు అమలు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ప్రజా మద్ధతు ఏ మాత్రం తగ్గకుండా తనదైన సాయికిలో దూసుకెళుతున్నారు. ఓ వైపు పథకాల పేరిట డబ్బులు ఇస్తూనే..మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేస్తున్నారు. భారీ సభలతో ప్రజలతో ఉంటున్నారు.
ఇలా జగన్ ప్రజల పక్షాన నిలబడుతూ వస్తున్నారు. అయితే జగన్ పరంగా ప్రజల్లో వ్యతిరేకత లేదు గాని..కొందరు వైసీపీ ఎమ్మెల్యేల పరంగా వ్యతిరేకత ఉంది..దీంతో అలాంటి వారిని నెక్స్ట్ పక్కన పెట్టి వేరే వారికి సీటు ఇవ్వాలని జగన్ చూస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో కాస్త వీక్ గా ఉన్న స్థానాలపై స్పెషల్ గా ఫోకస్ పెట్టి..కొత్త చేరికలని ప్రోత్సహిస్తున్నారు. అది కూడా ప్రజా బలం ఉన్న నేతలని వైసీపీలోకి తీసుకొస్తున్నారు. కొన్ని కీలక స్థానాల్లో జగన్ అలాంటి చేరికలని ప్రోత్సహిస్తున్నారు.
ఉదాహరణకు మంగళగిరిలో వైసీపీ వీక్ అవుతున్న మాట వాస్తవం..దీంతో ఆ స్థానంలో టిడిపిలో బలంగా ఉన్న నేతలని వైసీపీలోకి తీసుకొచ్చారు. ఇటీవల నెల్లూరులో ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి దూరమయ్యారు..అక్కడ కొందరు బలమైన నేతలని వైసీపీలో చేర్చుకునే కార్యక్రమాలు చేస్తున్నారు.
తాజాగా సత్తెనపల్లిలో కీలక నేత యర్రం వెంకటేశ్వర్ రెడ్డిని వైసీపీలో చేర్చుకున్నారు. ఇక్కడ వైసీపీ కాస్త వీక్ అవుతుంది..దీంతో యర్రం లాంటి నాయకుడుని వైసీపీలోకి తీసుకొచ్చారు. యర్రం గతంలో సత్తెనపల్లి నుంచి కాంగ్రెస్ లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ మధ్య కాలంలో రాజకీయాలకు దూరమైన యర్రం ఇప్పుడు తన తనయుడుతో కలిసి వైసీపీలోకి వచ్చారు. దీంతో సత్తెనపల్లిలో వైసీపీకి బలం చేకూరింది. ఇలా జగన్ వీక్ గా ఉన్న స్థానాలని బలోపేతం చేస్తున్నారు.