జగన్ ని బాగా ఇబ్బంది పెట్టేస్తున్న కోర్ట్…!

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కోర్ట్ లు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఆయన తీసుకునే ప్రతీ నిర్ణయం కూడా కోర్ట్ కి వెళ్ళడం దానికి కోర్ట్ అభ్యంతరం చెప్పడం వంటివి ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రతీ అంశానికి విపక్షాలు లేదా ఎవరో ఒకరు కోర్ట్ కి వెళ్ళడం తో జగన్ బాగా ఇబ్బంది పడుతున్నారు. తీసుకునే నిర్ణయం ఎలా ఉన్నా సరే అది ఏదోక రూపంలో వివాదాస్పదం అవుతూనే ఉంది.

ముందు విద్యుత్ ఒప్పందాల విషయంలో జగన్ తీసుకున్న సమీక్ష నిర్ణయం కోర్ట్ కి వెళ్ళడం తో కోర్ట్ అడ్డు చెప్పింది. ఆ తర్వాత మధ్య నిషేధం విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయంపై బార్లు కోర్ట్ కి వెళ్ళాయి. ఆ తర్వాత రాజధాని విషయంలో జగన్ కి ఎదురు దెబ్బలు బాగా తగిలాయి. కోర్ట్ వద్దని చెప్పినా సరే జగన్ మాత్రం వినే పరిస్థితి కనపడకపోవడం తో కోర్ట్ సీరియస్ అయింది.

విజిలెన్స్ కార్యాలయాలని తరలించడం పై కోర్ట్ బాగా సీరియస్ అయింది. రంగుల విషయంలో కోర్ట్ సీఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగులు వేయడంపై ప్రభుత్వం చెప్పిన సమాధానం కూడా కోర్ట్ కి చికాకు తెప్పించింది అనే చెప్పవచ్చు. ఇక వివేకా హత్య కేసులో కోర్ట్ జోక్యం చేసుకుని సిబిఐ కి అప్పగించడం జగన్ కి పెద్ద ఎదురు దెబ్బ అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. పోలవరం జలవిద్యుత్‌ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు విషయంలోనూ జగన్‌ ప్రభుత్వానికి ఆగస్టు 22న ఎదురు దెబ్బే తగిలింది.

కాంట్రాక్ట్ రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పింది కోర్ట్. ఇక పోలీసుల వ్యవహారంలో కూడా కోర్ట్ సీరియస్ అయింది. 500 మంది పోలీసులు రాజధాని గ్రామాల్లో కవాతు చేసిన అంశంపై డీజీపీ కోర్ట్ కి వెళ్లి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. విశాఖలో పోలీసులు చంద్రబాబుని అడ్డుకోవడంపై కూడా కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏకంగా దీనిపై డీజీపీ సెక్షన్ చదివి సమాధానం చెప్పుకున్నారు.

అలాగే ఇంగ్లీష్ మీడియ౦ విషయంలో జగన్ సర్కార్ కి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇంగ్లీషు మీడియం వ్యవహారంపై తమ ఆదేశాలను ధిక్కరించి ముందుకెళితే అధికారులపై చర్యలు తప్పవని హైకోర్టు హెచ్చరించింది. ఇంగ్లీషు మీడియంలోనే విద్యాభ్యాసం చేయాలని విద్యార్థుల్ని నిర్బంధించలేమని, అది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని జనవరి 27న స్పష్టం చేసింది. ఇళ్ళ పట్టాల విషయంలో అధికారులకు వార్నింగ్ ఇచ్చింది. ఇష్టం వచ్చినట్టు చేస్తే కోర్ట్ కి పిలిచి వారి నుంచి వసూలు చేస్తామని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news