దమ్ము గురించి దుమ్ము లేపుతున్న లోకేష్ ?

-

ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నా, ట్విట్టర్ ద్వారా తన రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు చంద్రబాబు తనయుడు నారా లోకేష్. ఏపీలో తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలోనూ లోకేష్ హైదరాబాదుకి పరిమితం అయిపోవడం, అదే సమయంలో చంద్రబాబు ప్రత్యక్షంగా అమరావతిలో పర్యటిస్తూ,పార్టీ జనాల్లో ఉత్సాహం పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తూ, ప్రభుత్వంపై బహిరంగంగానే విమర్శలు చేస్తూ పార్టీలో కొత్త ఉత్సాహం పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తూ, పార్టీ నాయకులు భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ లోకేష్ జనాల్లోకి రాకుండానే ప్రభుత్వంపై వాడివేడిగా విమర్శలు చేస్తూ, ఏపీ సీఎం జగన్ పై వ్యంగ్యంగా విమర్శలు చేస్తూ, సవాళ్లు విసురుతున్నారు.

తాజాగా అమరావతి పోరాటానికి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన జనభేరి బహిరంగ సభలో చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. వాటిని కొనసాగిస్తూ లోకేష్ ట్విట్టర్ లో వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ హడావుడి చేశారు. జనభేరి తో జగన్ రెడ్డికి మబ్బులు విడిపోయాయి అని, ప్రజలు ప్రాంతాలు, పార్టీలు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ అమరావతి కి జై కొట్టాయని, ఈ విషయం జనభేరి తో తేలిపోయిందని ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. మూడు ముక్కలాట కు కట్టుబడిన జగన్ రెడ్డికి చంద్రబాబు స్వీకరించే దమ్ము ఉందా అంటూ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.

ఇంత వరకు బాగానే ఉన్నా… లోకేష్ రాజకీయం పైనా విమర్శలు పెరిగిపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేతబట్టుకొని, ఆ పార్టీ నాయకులను నడిపించాల్సిన ఆయన ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ, పార్టీ శ్రేణులకు మరింతగా దూరమవుతున్నారని, 70 ఏళ్ల వయసు దాటిన చంద్రబాబు ఇంకా యాక్టివ్ గా ఉంటూ, పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం తీసుకువచ్చే విధంగా ప్రయత్నిస్తుంటే, లోకేష్ మాత్రం హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ ట్విట్టర్ ద్వారా మాత్రమే రాజకీయాలు చేయాలనుకోవడం వంటివి ఆయన రాజకీయ ఎదుగుదలకు అడ్డం పడతాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేవలం సోషల్ మీడియా ద్వారానే జగన్ పై విమర్శలు చేస్తూ, దమ్ము గురించి మాట్లాడుతూ… సవాళ్లు విసురుతూ హడావుడి చేస్తూ, పార్టీ శ్రేణులకు మరింత దూరం అవుతున్నట్లు గా లోకేష్ కనిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news