ప్రజలందరికీ మంచి చేశాం..మేనిఫెస్టోలో 98 శాతం హామీలని అమలు చేశాం..దాదాపు 89 శాతం ఇళ్లకు పథకాల ద్వారా లబ్ది చేకూరింది..కుప్పంతో సహ అన్నీ నియోజకవర్గాల్లో సర్పంచ్, ఎంపిటిసి, జెడ్‌పిటిసి, మున్సిపాలిటీ, కార్పొరేషన్లు గెలిచేశాం..ప్రజలంతా మనవైపే ఉన్నారు..అలాంటప్పుడు 175కి 175 సీట్లు ఎందుకు గెలవలేము..ఖచ్చితంగా గెలుస్తాం..అలాగే 30 ఏళ్ల పాటు తానే సీఎంగా ఉంటానని జగన్ ప్రతిసారి కాన్ఫిడెన్స్‌తో చెబుతున్నారు.
ఎప్పటికప్పుడు ఇవే జగన్ చెబుతూ ఉన్నారు..తాజాగా విశాఖ నార్త్ స్థానం నేతలతో భేటీ అయిన జగన్..మళ్ళీ ఇదే తరహాలో మాట్లాడారు. నాయకులని మోటివేట్ చేశారు..ఇంకా మనకు తిరుగులేదనే విధంగా చెప్పుకొచ్చారు. అంటే జగన్ టార్గెట్ 175 సీట్లు, 30 ఏళ్ళు సీఎం పదవి. సరే ఆశ పడటం తప్పు లేదు..కానీ అది అత్యాశ అయితేనే ఇబ్బంది. అయితే జగన్‌ది ఆశ, అత్యాశ అనేది ప్రజలే తేల్చాలి. కాకపోతే ప్రజలకు అంతా మంచి చేస్తే..అన్నీ సీట్లు గెలిచేస్తామని కాన్ఫిడెన్స్ ఉండటంలో తప్పు లేదు.
కానీ ఎంతమందికి మంచి జరిగింది..కేవలం పథకాల ద్వారా డబ్బులు ఇస్తే చాలా? అభివృద్ధి లేకపోయినా పర్లేదా? పన్నుల భారం పెరిగిన పర్లేదా? నిత్యావసర వస్తువులు పెరిగిన పర్లేదా? కరెంట్ బిల్లులు, ఇసుక ధరలు, పెట్రోల్, డీజిల్, ఇంటి పన్నులు…ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజలకు అవసరమైన ప్రతిదీ రేటు పెరిగిపోయింది. ఇక ప్రతిపక్షాలపై కక్ష సాధించడం, ప్రశ్నించినవాడిపై కేసు పెట్టడం…ఇంకా రకరకాలుగా దాడులు..ఇవన్నీ జరిగినా సరే 175 గెలిచేస్తామనే కాన్ఫిడెస్న్ పెట్టుకోవచ్చా? అంటే ఏమో అది జగన్‌కు, ప్రజలకు మధ్య ఉండేది అని అనుకోవచ్చు.
గతంలో కూడా పథకాల అమలు జరిగాయి..ఇప్పుడు ఇంకాస్త ఎక్కువ వస్తున్నాయి. అయితే దీంతోనే 175 సీట్లు, 30 ఏళ్ళు సీఎం అనే ఫార్ములా వర్కౌట్ అవ్వడం అనేది..రాజకీయాల్లో జరగడం కష్టం. కాకపోతే ఇలా చెప్పడం ద్వారా…కనీసం అధికారంలోకి రావడానికి కావల్సిన సీట్లు వస్తాయని భావిస్తున్నారో చెప్పలేం. మొత్తానికి జగన్ కాన్ఫిడెన్స్ మాత్రం మెచ్చుకోవాల్సిందే అని విశ్లేషకులు మాట్లాడుతున్నారు.